2 MIN READ

అప్పుడప్పుడు మర్చిపోవటం అన్నది సర్వ సాధారణం- మీరు ఫోన్ నంబర్‌ను
మరచిపోతారు, మీ ఇంటి తాళం చేతులను ఎక్కడ పొయ్యయ్యో మీకు తెలియదు,
మీరు అల్పాహారంగా ఏమి తీసుకున్నారో కూడా మీకు గుర్తు ఉండదు! కానీ వేచి
ఉండండి, మీకు వయస్సు పెరిగేకొద్దీ మీ మనస్సు వెనుక భాగంలో మీకు ఒక ఆలోచన
తడుతూ ఉంటుంది. ఇది అల్జీమర్స్ అని అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా
తెలియదా? మీరు మర్చిపోయారని అని మీకు గుర్తున్నట్లయితే, మీకు
అల్జీమర్స్ మీకు అల్జీమర్స్ లేనట్లే.
వృద్ధాప్యం రావడం అన్నది సాధారణమైనది మరియు దాన్ని మనం
తప్పించుకోలేము కూడా. మనం పెద్దయ్యాక మన శరీరం క్షీణిస్తుంది మరియు
మన మెదడు కూడా క్షీణిస్తుంది. మతిమరుపు కూడా వస్తుంది. అయినప్పటికీ,
వయస్సు-సంబంధిత మతిమరుపు కి మరియు అల్జీమర్స్ కు మధ్య
వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ముందుగానే
గుర్తించగలిగితేనే ఆ తరువాతి అనర్ధాలని ఆపగలం.
మీకు వచ్చే మతిమరుపు వయసు రీత్యా కాదు అల్జీమర్స్ వల్ల అని మీరు
గుర్తుపట్టగలగే కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:-
తెలిసిన ముఖాలు / ప్రదేశాలను గుర్తుంచుకోవడంలో
ఇబ్బంది
మీరు తెలిసిన వ్యక్తులను మరియు ప్రదేశాలను తరచుగా మరచిపోతే, ఇది
అల్జీమర్స్ యొక్క సంకేతం. తెలిసిన వ్యక్తులు, ప్రదేశాలు అంటే మీ కుటుంబ
సభ్యులు లేదా మీరు సందర్శించే ప్రదేశాలు. (మీ కార్యాలయం లేదా కిరాణా
దుకాణం వంటివి)

మనమందరం కూడా అప్పుడప్పుడు పేర్లను మరచిపోతాము. కానీ, తరచూ మరచిపోవటం
ఉంటే మాత్రం కొంచెం పట్టించుకోవాల్సిన విషయమే. ఇటీవలి సంభాషణలను
మరచిపోవడం మరియు మీరు ఈ మధ్య కలుసుకున్న మనుషులను మర్చిపోవటం లాంటివి
ఉంటే అది అల్జీమర్స్ యొక్క ప్రారంభ దశల లక్షణాలు. అంతేకాకుండా మీరు
తేదీలను, ఋతువులను మరియు దారులను కూడా మర్చిపోతారు.
వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏవైనా ఫోన్ నంబర్లు లేదా పేర్లను
మరచిపోవచ్చు. కానీ, తరువాత గుర్తుకుతెచ్చుకుంటారు లేదా కనీసం దాని గురించి
అడగుతారు.
రోజు వారీ పనులని పూర్తి చెయ్యటం కష్టంగా
అనిపించడం
అల్జీమర్స్ ఉన్న వ్యక్తి రోజువారీ లేదా అతని / ఆమె దినచర్యలో భాగమైన
పనులను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఉదాహరణకు- వారు పళ్ళు
తోముకున్నారో, లేదో మరియు స్నానం చేసారో, లేదో మర్చిపోవటమే కాకుండా,
పళ్ళు ఎలా తోముకోవాలో మరియు స్నానం ఎలా చేయాలో కూడా మర్చిపోతే అది
అల్జీమర్స్ యొక్క సంకేతం.
అపాయింట్మెంట్ లు తప్పిపోతాయి, ఒక్కసారి మాత్రమే కాదు, తరచుగా
అవుతుంటాయి. అల్జీమర్స్ తో బాధపడేవారికి సాధారణ రోజువారీ పనులలో
రోజువారీ పనితీరు బలహీనపడుతుంది.
భాష మరియు మాట్లాడే సరళిలో ఇబ్బందులు
పదాలతో ఇబ్బంది కలగడం అనేది అల్జీమర్స్ యొక్క అతిపెద్ద హెచ్చరికలలో
ఒకటి. అప్పుడప్పుడు నాలుక జారడం లేదా కొన్ని సందర్భంలో తప్పు పదాన్ని
ఉపయోగించడం అన్నది మాములే. కానీ,సంభాషణలో పాల్గొనేటప్పుడు తరచుగా
పదాలను మరచిపోవడం లేదా మాట్లాడుతూ మాట్లాడుతూ దేని గురించి
మాటాడుతున్నారో మరచిపోవడం కూడా సూచిక కావచ్చు. ఒకవేళ ఎవరైనా వారి
పదజాలంతో ఇబ్బందులు పడుతుంటే మరియు ఒక వస్తువును తప్పు పేరుతో పిలవడం
అంటే ‘వాచ్’ కు బదులుగా ‘హ్యాండ్-క్లాక్’ లాంటి ప్రత్యామ్నాయ పదాలను
ఉపయోగిస్తున్నారంటే, వారికి అల్జీమర్స్ ఉండవచ్చు. చాలా తరచుగా, వారు
బాటిల్ లేదా కాగితం వంటి సాధారణ వస్తువులను కూడా గుర్తించలేరు.

వస్తువులను లేదా లోతును గ్రహించే విధానంలో మార్పు
వస్తువులను లేదా లోతును గ్రహించే విధానంలో అల్జీమర్స్ ఉన్న
వ్యక్తుల్లో చాలా గందరగోళం నెలకొంటుంది. ఉదాహరణకు, వారు
నడుస్తున్నప్పుడు వ్యక్తుల మధ్య దూరాన్ని లేదా కుర్చీ లేదా మెట్ల
ఎత్తును సరిగ్గా అంచనావేయలేరు. విభిన్న రంగులు మరియు భేదాల మధ్య
వ్యత్యాసాన్ని గుర్తించడంలో వారికి ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ వాళ్లు
అద్దం ప్రక్కన నుంచి నడిస్తే, గదిలో ఎవరో ఉన్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది.
మరోవైపు, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకి అయితే, చూపు మందగించడం,
స్వల్ప అంధత్వం లేదా కంటిశుక్లం అభివృద్ధి చెందడం లాంటివి జరుగుతాయి.
ప్రవర్తనా మార్పులు
మనమందరం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. కానీ తీర్పులో
అకస్మాత్తు మార్పును గమనించినట్లయితే మరియు చాలా డబ్బు ఇవ్వడం లేదా
బడ్జెట్‌ ను నిర్వహించలేకపోవడం వంటి చెడు నిర్ణయాలు అనేవి అల్జీమర్‌
వ్యాధి యొక్క సంకేతాలు.
వయస్సు-సంబంధిత మతిమరుపు వల్ల మీరు ఏదైనా చెల్లింపును ఒకసారి
మరచిపోవచ్చు, కానీ అల్జీమర్‌ ఉన్నవాళ్ళలో అయితే ఇది పదేపదే జరుగుతుంది.
గతంలో ఇష్టపడిన అభిరుచులను లేదా కార్యకలాపాల ని వదిలేయయడం లేదా
వాటిని ఇంతకముందు అనుభూతులుగా పరిగణించి వాటిని వదిలెయ్యడం లాంటి
సామాజిక ప్రవర్తనలో గుర్తించదగిన మార్పు కూడా ఉంటుంది. వాళ్ళకి
ఇంతకముందు సౌకర్యవంతంగా ఉన్న వ్యక్తులతో కూడా నిరాశ, ఆందోళన,
గందరగోళం, భయం, ఆత్రుత లేదా అనుమానాస్పదంగా అనిపించడం మరియు ఆకస్మిక
మానసిక స్థితిలో మార్పు వంటి వ్యక్తిత్వ మార్పులు అనేవి అల్జీమర్స్
యొక్క సూచనలు.
పైన పేర్కొన్న అన్ని మార్పులను మీరు గమనించినట్లయితే, చెక్-అప్ మరియు
రోగ నిర్ధారణ కోసం మీ వైద్యుడిని సందర్శించడం చాలా ముఖ్యం.

Ask a question regarding అల్జీమర్స్ మరియు వృద్ధాప్యం కు మధ్య తేడా కనుగొనడం

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here