3 MIN READ

అల్జీమర్స్ రోగుల కొరకు ఆరోగ్యకరమైన వంటకాలు

వృద్ధులలో అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి భారతీయ ఆహారం
తోడ్పడుతుందని మరియు పసుపు, దాల్చినచెక్క మరియు నల్ల మిరియాలు వంటి
మసాలా దినుసులు చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగుల
లక్షణాలను తొలగించడంలో సహాయపడతాయి అని ఇటీవల నిర్వహించిన ఒక
అధ్యయనంలో వెల్లడైంది.
భారతదేశంలో ‘ఆరోగ్యకరం’ అంటే ఇక జీవితాంతం చప్పటి కిచిడి లేదా రుచిలేని
పెసర పప్పు తినడం అని ఎవరు చెప్పారు! అల్జీమర్స్ ఉన్న రోగుల కొరకు ఇక్కడ
కొన్ని ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన వంటకాలు ఉన్నాయి.

 

పసుపు పాలు

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, పసుపుని వంటకంలో ఒక ముఖ్యమైన భాగం
చేసుకున్న భారతదేశం మరియు ఇతర ఆసియా దేశాల్లో అల్జీమర్స్ వచ్చే
అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని మీకు తెలుసా?
దీనిని తయారుచేసుకోవడం కోసం, ఒక గ్లాసు ఆవు పాలు (లేదా కూరగాయల పాలు లేదా
నీరు) ల్లో, కొంచెం పసుపు, ఒక చిటికెడు దాల్చినచెక్క మరియు తగినన్ని నల్ల
మిరియాలు వేసి కొంచెం మరగపెట్టండి. అవసరమనుకుంటే ఒక చెంచా చక్కెర కూడా
వేసుకొవచ్చు.
మీరు దీన్ని మీ ఉదయం దినచర్యలో ఒక భాగంగా చేసుకోవచ్చు లేదా
నిరంతరాయమైన రాత్రి నిద్ర కోసం పడుకునే ముందు త్రాగవచ్చు.

బాదం హల్వా

చిత్తవైకల్యాన్ని నివారించడానికి మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి
రూపొందించబడిన మైండ్ డైట్ ప్రకారం, విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన
కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల గింజలు
చిత్తవైకల్యానికి వ్యతిరేకంగా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని
నిర్ణయించడంజరిగింది.
దీని తయారు చేయడం కోసం, మీరు బాదం పప్పు ను 5-7 గంటలు నానబెట్టి, తరువాత
దాని పొట్టు తీయాలి. నునుపైన పేస్ట్ ఏర్పడటానికి వీటిని తగినంత నీరు
పోస్తూ రుబ్బాలి. ఒక ప్యాన్ లో, వేడినీళ్లల్లో లేదా వేడి పాలల్లో ఈ
బాదం పేస్ట్ తో పాటు కొంచెం చక్కెర మరియు కుంకుమపువ్వు ను కూడా వేయండి.
తగినంత నెయ్యి వేసి బాగా కలిసేంత వరకు తిప్పండి.

ఘనపదార్ధ రూపంలోని ఆహరాన్ని అరిగించుకోవడం లో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ
రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం సరైనది మరియు చాలా బాగుంటుంది.

బజ్రా పాలక్ పరాత

ఈ వంటకం సజ్జల పిండి మరియు పాలకూర లను కలుపుతుంది, ఈ రెండూ గ్లూటెన్-
ఫ్రీ స్వభావం మరియు విటమిన్లు ఎ & సి యొక్క ఎక్కువ ఉండటం చేత ఈ రెండూ
కూడా అల్జీమర్స్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తారు.
ఒక కప్పు సజ్జల పిండి, చిన్న ముక్కలుగా తరిగిన తగినంత పచ్చిమిర్చి, తురిమిన
అల్లం, అర కప్పు తరిగిన పాలకూర ఆకులు మరియు ఉప్పు అన్నీ ఒక గిన్నెలో వేసి
తగినంత నీరు పోసి పిండిలాగా అయ్యేలా బాగా కలపండి.
ఈ పిండి తో పరాతా లను తయారు చేసుకోని, నెయ్యి మరియు కొత్తిమీర పచ్చడి
లాంటి వాటితో వేడి వేడిగా లాగించెయ్యండి.

కాలీఫ్లవర్ కీమా

కాలీఫ్లవర్, క్యాబేజీ మరియు బ్రోకలీ వంటి క్రూసిఫరస్ కూరగాయలలో
ఫోలేట్లు మరియు కెరోటినాయిడ్లు ఉంటాయి, ఇవి రసాయన సామర్థ్యం
యొక్క క్షీణతతో ముడిపడి ఉన్న హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తాయి.
దీని కోసం, మీరు తగినంత కాలీఫ్లవర్ ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి
పెట్టుకోవాలి. తరువాత తాలింపు గింజలతో తాలింపు వేయాలి. తాలింపు
అయిపోయాక తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు, మెత్తగా తరిగిన అల్లం, వెల్లుల్లి,
పచ్చిమిర్చి, వాము, ఎర్ర కారం, ధనియాల పొడి, హల్ది మరియు సాంప్రదాయంగా
ఇంట్లో తయారుచేసుకున్న గరం మసాలా వంటి సుగంధ ద్రవ్యాలను వేయండి.
ఆకుపచ్చ కొత్తిమీరతో ముగించి, గోధుమ రొట్టెల తో పాటు లేదా అన్నంతో
కలిపి తినండి.

రాజ్మా కూర

టమోటాలు మరియు ఉల్లిపాయలతో తయారు చేసిన మంచి చిక్కటి గ్రేవీ, లేత
రాజ్మా మరియు మసాలా దినుసుల నోరూరించే వాసన- ఇవన్నీ రాజ్మా కూరను ప్రతి
ఉత్తర భారతదేశపు వాళ్ళ వంటగదిలో విడదీయరాని భాగంగా చేస్తుంది.
దీనికోసం, రాజ్మా ను ఒక రాత్రంతా నానబెట్టండి. తరువాత రోజు నీటిని
వడపోసిన తరువాత, వాటిని కడిగి, రాజ్మాను సుమారు 20 నిమిషాలు పాటు ప్రెషర్
కుక్కర్ లో ఉడికించాలి.
ప్యాన్ లో నూనె కాగిన తరువాత, కొన్ని తరిగిన ఉల్లిపాయలు, అల్లం,
వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమోటాలు జోడించండి. ధనియాల పొడి, హల్ది, ఎండు

మిర్చి మరియు గరం-మసాలా పౌడర్ను జోడించండి. మసాలా దినుసుల నుండి నూనె
వేరవ్వడం ప్రారంభమయ్యే వరకు అలాగే ఉడకనివ్వాలి.
ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో వండిన రాజ్మాను దీనిలో వేసి ఒక 2-15 నిమిషాలు
ఉడికించాలి. అంతే ఇక ఘుమఘుమ లాడే రాజ్మా కూర తయారైపోతుంది. దీనిని వేడి
వేడి అన్నంలో లేదా గోధుమ రొట్టెలతో కలిపి తినేసెయ్యండి.
చిట్కా- కిడ్నీ బీన్స్ కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. వంట చేసేటప్పుడు
దాంట్లో కాస్త ఇంగువ వేసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

గమనిక- ఈ వంటలను ప్రయత్నించే ముందు, మీకు వీటిలో ఏ పదార్థాలకు కూడా
అలెర్జీ లేదని నిర్ధారించుకోండి. అలాగే, కొత్త తరహా జీవనశైలికి మారడానికి
ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

Ask a question regarding అల్జీమర్స్ రోగులకు 5 ఆరోగ్యకరమైన భారతీయ వంటకాలు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here