2 MIN READ

ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం యొక్క వాపు సంభవించడం. ఇది సాధారణంగా అధికంగా మద్యం సేవించేవారిలో జరుగుతుంది. కానీ కొన్నిసార్లు, ఎక్కువ మద్యం సేవించేవారిలో ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ రాదు. కొన్నిసార్లు కొంతమందిలో తక్కువ మద్యం సేవించే వారికి కూడా ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ వస్తుంది.

ఆల్కహాలిక్ హెపటైటిస్ లక్షణాలు

ఈ వ్యాధి అత్యంత సాధారణ లక్షణం కామెర్లు. అది కాకుండా, మరికొన్ని లక్షణాలు ఏంటంటే:

  • ఆకలి లేకపోవడం
  • స్వల్ప జ్వరం
  • వికారం మరియు వాంతులు
  • ఉదరంలో సున్నితత్వం
  • అలసట

పరిస్థితి విషమిస్తే, ఆ వ్యక్తి కాలేయం మరియు మూత్రపిండాల వైఫల్యంతో కూడా బాధపడవచ్చు.

ఇది ఎలా జరుగుతుంది

సేవించిన  ఆల్కహాల్ ను విచ్ఛిన్నం చేసేటప్పుడు శరీరం కొన్ని టాక్సిన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ టాక్సిన్స్ ఆరోగ్యకరమైన కాలేయ కణాలను నాశనం చేసే మంటలను ప్రేరేపిస్తాయి. కాలంక్రమేణా, ఆరోగ్యకరమైన కణాలు అనారోగ్య కణజాలంతో భర్తీ చేయబడతాయి.  చివరికి ఆ వ్యక్తిలో కాలేయ సిర్రోసిస్‌ కోటుచేసుకోని, అతను  కోలుకోలేని దెబ్బతినే స్థితికి చేరుకుంటాడు.

 

హెపటైటిస్ సి ఉన్నవారు లేదా పోషకాహార లోపం ఉన్నవారు వారి కాలేయ పనితీరు అప్పటికే ప్రమాదంలో ఉన్నందున వారిలో సిర్రోసిస్  వేగంగా అభివృద్ధి చెందుతుంది.

ప్రమాద కారకాలు

ఆల్కహాలిక్ హెపటైటిస్ కి ఆల్కహాల్ అనేది అతిపెద్ద ప్రమాద కారకం. ఇది క్రింది ప్రమాద కారకాలతో ఇతరులలో కూడా సంభవించవచ్చు:

  • లింగం: మహిళలు తమ శరీరాలు ప్రాసెస్ చేయబడిన విధానం వల్ల వాళ్ళకి ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
  • అతిగా మద్యం సేవించడం: పురుషులు రెండు గంటల్లో ఐదు పానీయాలు సేవించడం మరియు మహిళలు నాలుగు పానీయాలు సేవించడం కూడా ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.
  • వారసత్వం: ఆల్కహాల్ ప్రేరిత కాలేయ వ్యాధి వారసత్వంగా కూడా రావొచ్చు.
  • స్థూలకాయం: ఊబకాయం ఉండి అధికంగా మద్యం సెవొంచేవారిలో ఇతరులకన్నా వేగంగా సిర్రోసిస్‌ వచ్చే అవకాశం ఉంది.

ఆల్కహాలిక్ హెపటైటిస్ రాకుండా ఎలా నిరోధించవచ్చు?

క్రింద ఇచ్చిన వాటిని పాటించి మీ ప్రమాదాన్ని తగ్గించుకోండి:

  • మద్యం సేవించొద్దు లేదా మితంగా సేవించండి: అన్నిటికంటే పాటించాల్సిన విషయం ఏమిటంటే మద్యం సేవించకపోవడం, కానీ కొన్ని తప్పని సందర్భాలలో ఎప్పుడూ తక్కువ మద్యం సేవించండి. మితమైన మద్యపానం అంటే అన్ని వయస్సు మహిళలకు మరియు 65 కంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులకు రోజుకు ఒక పెగ్, మరియు 65 మరియు అంతకంటే తక్కువ వయస్సు గల పురుషులకు రోజుకు రెండు పెగ్ లు.
  • మద్యం మరియు మందులను కలపవద్దు: మందులు వాడుతున్నప్పుడు మద్యం తాగవద్దు, ముఖ్యంగా నొప్పి మందులు తీసుకుంటున్నప్పుడు అస్సలు మద్యం తాగవద్దు. మీరు మరే ఇతర మందులు వాడిప్పుడు అయినా మద్యం సేవించొచ్చో, లేదో  మీ వైద్యుడిని అడగండి. ఆల్కహాల్ మరియు మందులు రియాక్ట్ అయ్యి కాలేయానికి హాని కలిగిస్తాయి.

హెపటైటిస్ సి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి: వేరే వారికీ వాడిన సూదులు వాడకండి మరియు ఆసుపత్రిలో సూదుల సీల్ ను  ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. మీకు హెపటైటిస్ సి ఉంటే, అది కాలేయ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. కాబట్టి మీరు తాగడం మానేయాలి.

Ask a question regarding ఆల్కహాలిక్ హెపటైటిస్ గురించి పూర్తి సమాచారం

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here