6 MIN READ

క్యాన్సర్ అంటే ఏమిటి?
క్యాన్సర్ అంటే వ్యాధుల సమూహం. దీనివల్ల కణాలు అనియంత్రితంగా విభజన
అవుతూ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కలిగే మరణాల కారణాలలో ఇది
రెండవది.
క్యాన్సర్ పెరుగుదలను అర్థం చేసుకోవడం
మానవ శరీరం కణాలు అనే ప్రాథమిక యూనిట్లతో తయారవుతుంది. పాత కణాలు
చనిపోతాయి మరియు వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. కణాలు
క్రమంగా పెరిగి విభజన చెందుతాయి. కొన్నిసార్లు, కొన్ని జన్యు మార్పులు ఈ
ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల కణాలు అసాధారణంగా పెరుగుతాయి.
ఈ అసాధారణ కణాల పెరుగుదలను కణితి అంటారు.
కణితి నిరపాయమైనది లేదా ప్రాణాంతకమైనది కావచ్చు. నిరపాయమైన కణితి
అనేది అసాధారణమైన కణాల పెరుగుదల మాత్రమే. అది వ్యాప్తి చెందదు.
ఇలాంటి కణితులు సాధారణంగా హానిచేయనివి మరియు క్యాన్సర్ కారకం కావు.
కానీ, ఆ కణితి యొక్క పరిమాణం కొన్నిసార్లు కొన్ని అవయవాల యొక్క
సాధారణ విధులకు ఆటంకం కలిగిస్తుంది. కానీ, ప్రాణాంతక కణితి అనియంత్రిత
పెరుగుదలను కలిగి ఉంటుంది. ఇది సమీప కణజాలంపై దాడి చేస్తుంది లేదా శరీరం
చుట్టూ కూడా వ్యాపించవచ్చు. ఇవి క్యాన్సర్ కు కారకం అవుతాయి మరియు
శరీరం యొక్క సాధారణ పనితీరును ప్రభావితం చేస్తాయి.

లుకేమియా వంటి కొన్ని క్యాన్సర్లు ఘన కణితులను ఏర్పటుచేయవు.
కొన్ని క్యాన్సర్ కణాలు రక్తం లేదా శోషరస వ్యవస్థల ద్వారా శరీరంలోని
ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. దీనిని మెటాస్టాసిస్ అంటారు.
మెటాస్టాటిక్ క్యాన్సర్లు సాధారణంగా అధునాతన దశలో గుర్తించబడతాయి
మరియు వాటికి చికిత్స చేయడం చాలా కష్టం.
క్యాన్సర్ రకాలు ఏమిటి?
శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ప్రారంభమైన దాని
ఆధారంగా వైద్యులు క్యాన్సర్ ని ఐదు రకాలుగా విభజించారు.
క్యాన్సర్లో ఐదు ముఖ్యమైన రకాలు ఉన్నాయి:

1. కార్సినోమాలు: చర్మం లేదా అంతర్గత అవయవాలు మరియు గ్రంథుల ఉపరితలాన్ని కప్పి
ఉంచే కణజాలంలో కార్సినోమాలు ప్రారంభమవుతాయి. చర్మ క్యాన్సర్,
ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్
దీనికి ఉదాహరణలు.

2. సర్కోమాలు: ఇది చాలా అరుదైన క్యాన్సర్. ఇది శరీరానికి మద్దతునిచ్చే మరియు
కలిపే కణజాలాలలో ప్రారంభమవుతుంది. ఇది కొవ్వులో, కండరాలలో, నరాలలో,
స్నాయువులలో, కీళ్ళలో, రక్త నాళాలలో, శోషరస నాళాలలో, మృదులాస్థి లేదా
ఎముకలలో అభివృద్ధి చెందుతుంది.
3. ల్యూకేమియా: ల్యూకేమియా అనేది రక్తం మరియు ఎముక మజ్జ యొక్క క్యాన్సర్.
ఆరోగ్యకరమైన రక్త కణాలు మారి అనియంత్రితంగా పెరిగినప్పుడు ల్యూకేమియా
ప్రారంభమవుతుంది.
4. లింఫోమా: లింఫోమా అనేది శోషరస వ్యవస్థలో ప్రారంభమయ్యే క్యాన్సర్. ఇది
ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడే నాళాలు మరియు గ్రంథుల నెట్వర్క్, దీనిని
సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ అని కూడా పిలుస్తారు.

మైలోమా: ఇది సాధారణ తెల్ల రక్త కణాలని భర్తీ చేసే ప్లాస్మా కణాల యొక్క
క్యాన్సర్. ఇది వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి
ఏ జీవనశైలి మార్పులు మీకు సహాయపడతాయి?

కొన్ని రకాల క్యాన్సర్లు జన్యు ఉత్పరివర్తనాలపై ఆధారపడి ఉన్నప్పటికీ,
వాటిని పూర్తిగా నివారించలేనప్పటికీ, ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని
జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు:
 పొగాకు లేదా గుట్కాలకు దూరంగా ఉండండి. ఇది నోటి క్యాన్సర్ వచ్చే
అవకాశాలను పెంచుతుంది.
 పండ్లు మరియు కూరగాయలతో నిండిన ఫైబర్‌ ఎక్కువ ఉండే ఆరోగ్యకరమైన
ఆహారం తీసుకోండి. ఎర్ర మాంసం మరియు వేయించిన పదార్ధాలకు దూరంగా
ఉండండి.
 ధూమపానం మరియు మద్యపానం మానుకోండి
 ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించండి
 సరిపోను బరువు ఉండేలా చూసుకుంటూ శారీరకంగా చురుకుగా ఉండండి
 హానికరమైన యూవీ కిరణాల నుండి జాగ్రత్త వహించండి
 సురక్షితమైన శృంగారం లో పాల్గొనండి

 ఒకరు వాడిన సూదులను వాడకండి
 హెచ్ పి వి వైరస్ మరియు హెపటైటిస్ బి లకు టీకాలు వేయించుకోండి
 క్యాన్సర్ వచ్చే అవకాశాలున్న చోట మీరు ఉన్నట్లయితే వివిధ రకాల
క్యాన్సర్ల కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోండి.
క్యాన్సర్‌కు కారణాలు ఏమిటి?
చాలా క్యాన్సర్ల వెనుక ఒక ప్రత్యేక కారకం లేనప్పటికీ, వైద్యులు కొన్ని
రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలను ప్రేరేపించే కొన్ని కారణాలను
వెల్లడించారు. ఆ ప్రమాద కారకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
 వయస్సు: క్యాన్సర్ కాలాన్ని బట్టి(కొన్నిసార్లు సంవత్సరాలు,
కొన్నిసార్లు దశాబ్దాలుగా) అభివృద్ధి చెందుతుందని చెబుతారు. అందువల్ల
65 ఏళ్లు పైబడిన వారికి ఒకరకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఏది
ఏమయినప్పటికీ, ఇది కేవలం వృద్ధాప్యానికి మాత్రమే పరిమితం కాదు,
ఎందుకంటే జన్యు లేదా పర్యావరణ కారకాల ఫలితంగా తక్కువ వయస్సు
వారిలో మరియు బాల్య వయస్సులోనూ క్యాన్సర్ వచ్చిన వారి కేసులు
పెరుగుతున్నాయి.
 అలవాట్లు: అలవాట్లు మరియు జీవనశైలి విధానం అనేక క్యాన్సర్ల వెనుక ఒక
సాధారణ కారణం. ముఖ్యంగా, ధూమపానం మరియు మద్యపానం పురుషులు మరియు
స్త్రీలలో క్యాన్సర్కు ప్రధాన కారణాలు. మసాలా ఆహారం, ఊబకాయం,
సూర్యుడికి అధికంగా గురికావడం, అపరిశుభ్రమైన వ్యక్తిగత సంరక్షణ
మరియు అసురక్షిత సెక్స్ అనేవి క్యాన్సర్ రావడానికి ఇతర జీవనశైలి
కారకాలు.
 జన్యుశాస్త్రం: జన్యు ఉత్పరివర్తనాల వల్ల క్యాన్సర్ వచ్చే
అవకాశాలు చాలా తక్కువ, అయితే, దీనిని తోసిపుచ్చలేము.
 పర్యావరణం: క్యాన్సర్ విషయానికి వస్తే, మన చుట్టూ ఉండే
విషపూరిత వాతావరణాన్ని మరియు మనం తీసుకునే కల్తీ ఆహారాన్ని
పరిగణనలోకి తీసుకుంటే పర్యావరణం కీలక పాత్ర పోషిస్తుంది. గాలిలో
పొగ, విష వాయువులు, కాలుష్యం, బెంజీన్, ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు
క్యాన్సర్లను ప్రేరేపించే ప్రధాన కారణాలు. అలాగే, క్యాన్సర్
కారకాలతో ఉండే కల్తీ ఆహారం చాలా ముఖ్య కారకం.
 ఆరోగ్య పరిస్థితులు: వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ(ulcerative
colitis) వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మీకు క్యాన్సర్ వచ్చే
ప్రమాదాన్ని పెంచుతాయి.

క్యాన్సర్ లక్షణాలు ఏమిటి?
క్యాన్సర్ పెరిగేకొద్దీ, ఇది సోకిన అవయవాలు / కణజాలం యొక్క
నిర్మాణాన్ని మారుస్తుంది లేదా సమీప అవయవాలు, నరాలు లేదా కణజాలాల
ఆకృతికి లేదా స్థానానికి మార్పులు చేస్తుంది. అందువల్ల ఇది కొన్ని
సంకేతాలు మరియు లక్షణాలను కలుగజేస్తుంది. క్యాన్సర్ మెటాస్టాటిక్
అయితే, శరీరంలోని వివిధ భాగాలలో సంకేతాలు లేదా లక్షణాలను గమనించవచ్చు.
బయటి అవయవాలపై కణితిని సులభంగా గుర్తించవచ్చు మరియు అనుభూతి
చెందవచ్చు. అయితే లోపల ఏర్పడే కణితి చాలా కాలం వరకు గుర్తించబడదు. కానీ,
అతిచిన్న కణితులు కూడా మెదడు లాంటి కొన్ని అవయవాలలో లక్షణాలను
కలిగిస్తాయి. అలాంటప్పుడు వెంటనే స్పందించాలి.
ప్రతి క్యాన్సర్ భిన్నంగా ప్రవర్తిస్తుంది. అయితే, క్యాన్సర్ యొక్క
సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఇలా ఉంటాయి:
 ఆకస్మికంగా బరువు తగ్గడం: ఇది క్యాన్సర్ యొక్క మొదటి సంకేతం.
ప్యాంక్రియాటిక్, కడుపు, అన్నవాహిక లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్
ఉన్నవారిలో బరువు తగ్గడం సర్వసాధారణం, కానీ ఏ రకమైన క్యాన్సర్‌
వచ్చినా ఇలా జరుగుతుంటుంది.
 అసాధారణ రక్తస్రావం: ఇది వివిధ క్యాన్సర్లలో గమనించవచ్చు.
దగ్గినప్పుడు రక్తం రావడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం.
మలంలో రక్తం రావడం అనేది పెద్దప్రేగు లేదా మల క్యాన్సర్‌కు సంకేతం
కావచ్చు. గర్భాశయ లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళలల్లో
అసాధారణ యోని రక్తస్రావం కావొచ్చు. మూత్రంలో రక్తం రావడం అనేది
మూత్రాశయం లేదా మూత్రపిండాల క్యాన్సర్‌ను సూచిస్తుంది. స్త్రీ
చనుమొన నుండి రక్తస్రావం అవ్వడం అనేది రొమ్ము క్యాన్సర్‌ను
సూచిస్తుంది.
 గడ్డలు ఏర్పడడం: చర్మం కింద గడ్డలు గా అనిపిస్తుంటాయి. రొమ్ము,
వృషణాలు, శోషరస కణుపులు మొదలైన వాటిలో క్యాన్సర్ ఉంటే మనకి ఆ యా
ప్రదేశాలలో గడ్డలుగా అనిపిస్తుంటాయి.
 చర్మ మార్పులు: చర్మం పచ్చబారడం, ఎర్ర బడడం లేదా నల్లబడటం, నయం
అవ్వని పుండ్లు కావటం లేదా ఉన్న పుట్టుమచ్చలలో మార్పులు కలుగవచ్చు.

 వివరించలేని జ్వరాలు మరియు రాత్రి పూట చెమట పట్టడం: క్యాన్సర్
మెటాస్టాసైజ్ అయినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ప్రతి
క్యాన్సర్ రోగికి ఏదో ఒక సమయంలో జ్వరం తగులుతుంటుంది.
 నిరంతర దగ్గు లేదా మొద్దుబారడం: ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక
లేదా థైరాయిడ్ క్యాన్సర్ కు ఈ లక్షణం సంకేతం.
 నోటిలో మార్పులు: నాలుక పగుళ్లు, నోటిలో పుండ్లు, రక్తస్రావం లేదా
తిమ్మిరి చోటుచేసుకోవడం అనేవి నోటి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు.
 మింగడానికి ఇబ్బంది కలగడం: ఇది గొంతు లేదా అన్నవాహిక క్యాన్సర్ కు
సంకేతం కావచ్చు.
 నిరంతర అజీర్ణం లేదా జీర్ణవ్యవస్థ లో అసౌకర్యం: ఈ లక్షణాలు కడుపు
లేదా అన్నవాహిక క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చు.
 ప్రేగు లేదా మూత్రాశయ కదలికలలో మార్పులు: మలబద్ధకం, విరోచనాలు
మరియు ఇతర ప్రేగు సమస్యలు అనేవి పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం.
మూత్రాశయం మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు మూత్రవిసర్జన
సమయంలో నొప్పి అనుభవించడం, మూత్రంలో రక్తం కారడం లేదా ఇతర
మూత్రాశయం-పనితీరు మార్పులను అనుభవించవచ్చు.
 నిరంతర, వివరించలేని కండరాల లేదా కీళ్ల నొప్పులు: క్యాన్సర్ శరీరమంతా
వ్యాపించినప్పుడు తరువాతి దశలలో నొప్పి అనేది సాధారణం. అయినప్పటికీ,
ఎముక లేదా వృషణ క్యాన్సర్ లలో నొప్పి అనేది ఆ క్యాన్సర్ యొక్క
ప్రారంభ లక్షణంగా సూచించబడుతుంది. పెద్దప్రేగు, మల,
ప్యాంక్రియాటిక్ లేదా అండాశయ క్యాన్సర్లలో మధ్య వెన్నునొప్పి
అనేది చాలా సాధారణం. నిరంతర తలనొప్పి అనేది మెదడు కణితులకు సంకేతం.
 స్థిరమైన బలహీనత లేదా రక్తహీనత: క్యాన్సర్ కణాలు శరీర శక్తి సరఫరాను
ఎక్కువగా వాడుకోవటం వల్లన, స్థిరమైన బలహీనతను అనుభవించవచ్చు.

ఈ లక్షణాలు ఎప్పుడూ క్యాన్సర్ లోనే కాదు. అనేక సాధారణ సమస్యలు లేదా
నిరపాయమైన కణితిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.అయినప్పటికీ, మీకు
అసాధారణమైన లేదా ఎక్కువసేపు ఉన్న లక్షణాలను గమనించినట్లయితే వెంటనే
స్పందించవలెను.
క్యాన్సర్ ను గుర్తించడం ఎలా?

క్యాన్సర్ ఎంత ప్రారంభ దశలో నిర్ధారణ అయ్యి తగు చికిత్స జరిగితే, ఆ
క్యాన్సర్ రోగులు బ్రతకడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. దురదృష్టవశాత్తు,
వచ్చే 70% క్యాన్సర్ కేసులు తరువాతి దశలో కనుగొనబడతాయి. వాటిని నయం
చేయడం కష్టం.

రోగి అసాధారణ లక్షణాలను గమనించి, సాధారణ వైద్యుడిని సందర్శించినప్పుడు
దాన్ని రోగ నిర్ధారణ యొక్క మొదటి దశ అనవచ్చు. స్వీయ పరీక్ష లేదా
రొటీన్ చెకప్ సమయంలో కూడా చాలా సార్లు క్యాన్సర్ తాలూకు లక్షణాలు
గుర్తించబడతాయి.
ఆ లక్షణాలు క్యాన్సర్ వా కాదా మరియు క్యాన్సర్ ఏ దశలో ఉందో
తెలుసుకోవడానికి డాక్టర్ సాధారణంగా క్రింద పేర్కొన్న విధానాలను
అనుసరిస్తాడు:
 పరీక్ష: పూర్తి శారీరక పరీక్ష చేయబడుతుంది మరియు వైద్య చరిత్ర నమోదు
చేయబడుతుంది.
 స్క్రీనింగ్: కొలొనోస్కోపీ, మామోగ్రఫీ, కాల్‌పోస్కోపీ మరియు
క్యాన్సర్‌ను నిర్ణయించే పాప్ స్మీయర్ పరీక్ష వంటి కొన్ని
స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ రావడానికి ఎక్కువ ప్రమాదం

ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని తెలుసుకోవడానికి జన్యు
పరీక్షలు కూడా చేస్తారు.
 ల్యాబ్ పరీక్షలు: రక్తం, మూత్రం మరియు మలం కోసం ల్యాబ్ పరీక్షలు
కణాల అసాధారణతలను గుర్తించడంలో సహాయపడతాయి. 50 ఏళ్లు పైబడిన
పురుషులకు రెగ్యులర్ పిఎస్‌ఎ పరీక్షలు, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను
ముందుగా గుర్తించడానికి మరియు మహిళలకు అండాశయ క్యాన్సర్‌కు సిఎ 125
సూచించబడతాయి. అలాగే, కొన్ని ఇతర ట్యూమర్ మార్కర్స్ కొన్ని
క్యాన్సర్లను ముందుగా గుర్తించడంలో సహాయపడతాయి.
 ఇమేజింగ్ పరీక్షలు: లోతుగా ఉన్న వివిధ క్యాన్సర్లను గుర్తించడంలో
రేడియోలాజికల్ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్
(యుఎస్‌జి), సిటి స్కాన్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ),
మామోగ్రామ్, ఎండోస్కోపీ, మొదలైనవి సాధారణంగా ఉపయోగించే
ఇమేజింగ్ పరీక్షలు.
 పాథలాజికల్ ఇన్వెస్టిగేషన్స్: చాలా క్యాన్సర్లకు, బయాప్సీ అనేది
క్యాన్సర్ ని మరియు ఆ క్యాన్సర్ యొక్క ఖచ్చితమైన రకాన్ని
నిర్ణయించే ఏకైక మార్గం. ఇందులో, అనుమానాస్పద కణితి యొక్క చిన్న
కణజాలం తీసుకొని క్యాన్సర్ కణాల కోసం పరీక్షించబడుతుంది. ఎఫ్ఎన్ఏసి
(ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైటోలజీ), కణితి రకం ఆధారంగా పిఏపి స్మీర్
అనేవి ఇతర దర్యాప్తు విధానాలు.
 న్యూక్లియర్ స్కాన్లు: ఇవి సుదూర అవయవాలకు క్యాన్సర్ యొక్క
మెటాస్టాసిస్‌ను నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణ: పీఈటి సీటి
స్కాన్.
క్యాన్సర్ మరియు దాని దశ యొక్క సానుకూల నిర్ధారణ ఆధారంగా, రోగులను
తదుపరి చికిత్స కోసం క్యాన్సర్ నిపుణులకు సూచిస్తారు.
క్యాన్సర్ కు ఎలా చికిత్స చేస్తారు?
క్యాన్సర్ చికిత్స విధానం అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు
దానియొక్క దశ మీద ఆధారపడి ఉంటుంది. చికిత్స యొక్క లక్ష్యం ఏంటంటే
క్యాన్సర్ కణాలను నిర్మూలించడం మరియు సమీప కణాలు దెబ్బతినకుండా ఆ
క్యాన్సర్ కణాల పెరుగుదలను పరిమితం చేయడం. క్రింద ఇవ్వబడిన వివిధ రకాలైన
చికిత్సలలో ఎక్కువగా ఒకటికి ఒకటి కలిపి చేస్తుంటారు.

 శస్త్రచికిత్స: కణితిని నేరుగా తొలగించడానికి ఇది చేస్తారు.

 కీమోథెరపీ: క్యాన్సర్ కణాలను రసాయనాలతో చంపడానికి ఇలా చేస్తారు.
 రేడియేషన్ థెరపీ: క్యాన్సర్ కణాలను చంపడానికి రేడియేషన్లను
ఉపయోగిస్తారు.
 ఇమ్యునోథెరపీ: క్యాన్సర్ కణాలను గుర్తించి వాటితోటి పోరాడటానికి
శరీరం యొక్క సహజ రక్షణ యంత్రాంగాన్ని పెంచుతారు.
 హార్మోన్ల చికిత్స: కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలకు
హార్మోన్ ల అవసరం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్సోజనస్
హార్మోన్లు లేదా యాంటీ హార్మోన్ల మందులు ఇచ్చి ఆ క్యాన్సర్ కు
చికిత్స చేస్తారు. ఉదా: రొమ్ము క్యాన్సర్
 టార్గెటెడ్ థెరపీ: క్యాన్సర్ కణాల యొక్క నిర్దిష్ట విధులు లేదా
దుర్బలత్వాలపై దాడి చేయడానికి డ్రగ్స్ ని ఉపయోగిస్తారు. అలాంటి
సందర్భాలలో ఇది ఉపయోగపడుతుంది. ఉదా: లుకేమియా
 ఉపశమన సంరక్షణ: ఆధునిక సందర్భాల్లో, క్యాన్సర్ కణాల పూర్తి
నిర్మూలన సాధ్యం కానప్పుడు, రోగులకు పాలియేటివ్ థెరపీ ని
సూచిస్తారు. దీనిలో నొప్పిని తగ్గించడం, స్టెంటింగ్ (పెద్దప్రేగు
లేదా అన్నవాహిక క్యాన్సర్ విషయంలో), మెదడు మరియు ఎముక
మెటాస్టాసిస్‌కు రేడియోథెరపీ ఉంటాయి. లక్షణాలు, దుష్ప్రభావాలు,
నొప్పి, శారీరక మరియు మానసిక ఒత్తిడి నుండి రోగికి ఉపశమనం కలిగించడమే
దీని లక్ష్యం.
క్యాన్సర్ రోగికి ఎలా మద్దతు ఇవ్వాలి?
చాలా క్యాన్సర్ చికిత్సలు రోగికి మరియు కుటుంబానికి చాలా కష్టతరమైనవి.
మానసికంగా, ఆర్థికంగా, మానసికంగా మరియు లాజిస్టిక్‌గా కూడా మద్దతు
అవసరం. నొప్పి, బలహీనత, నిరాశను నిర్వహించడం మరియు మొత్తం ఆరోగ్యం
మరియు జీవన నాణ్యతను నిర్వహించడం దీని లక్ష్యం.
నివారణ చికిత్స తర్వాత, క్యాన్సర్ రోగి సహాయక సంరక్షణను పొందవచ్చు.
సహాయక సంరక్షణలో ప్రధానంగా పునరావాసం మరియు కోలుకోవడం లేదా నొప్పి
నివారణ కోసం వారి ఆయుర్ధాయం తీరుతున్న రోగుల సంరక్షణకు సహాయపడే అనేక
రకాల చికిత్సలు ఉన్నాయి.
సహాయక సంరక్షణలో కొన్ని:

 ప్రత్యామ్నాయ మందులు: శక్తిని పెంచడానికి మరియు దుష్ప్రభావాలను
తగ్గించడానికి సహజ నివారణలుగా నేచురోపతి, ఆయుర్వేద, హోమియోపతి
మరియు యునాని మందులను నివారణ చికిత్సతో పాటు లేదా నివారణ చికిత్స
తరువాత అయినా వాడవచ్చు.
 ఫిజియోథెరపీ: చాలా క్యాన్సర్ కేసులలో త్వరగా కోలుకోవడంలో బలాన్ని
పునర్నిర్మించడంలో మరియు చికిత్స యొక్క కొన్ని శారీరక
దుష్ప్రభావాలను అధిగమించడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 మైండ్-బాడీ మెడిసిన్: మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి మరియు
ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యానం మరియు యోగా వ్యాయామాలు
సిఫార్సు చేయబడతాయి.
 క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్: క్యాన్సర్ వచ్చినన వాళ్ళకి సహాయపడే
అనేక క్యాన్సర్ సపోర్ట్ గ్రూపులు మరియు క్యాన్సర్ నుంచి బయట పడిన
వారి కథలు ఉన్నాయి.
 సంరక్షకుని మద్దతు: క్యాన్సర్ రోగుల సంరక్షకులు లేదా కుటుంబ సభ్యులకు
శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సంరక్షణ రంగాలలో కూడా మద్దతు
అవసరం. రోగి మరణించిన తరువాత జీవితాన్ని నిర్వహించడం కోసం సలహా
ఇస్తారు.

Ask a question regarding క్యాన్సర్ గురించి మీరు తెలుసుకోవలసినవి: కారణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here