2 MIN READ

భారతదేశంలో క్యాన్సర్ చికిత్స అనేది చాలా ఖరీదైన ప్రక్రియ. శస్త్రచికిత్స నుండి కీమోథెరపీ మరియు రేడియేషన్ యొక్క రౌండ్ల వరకు, ఇది చికిత్స పొందడంలో బాధితుని పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. క్యాన్సర్ చికిత్స కోసం నిధులు సేకరించటానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. మన దేశంలో చాలా మందికి క్యాన్సర్ భీమా లేదు మరియు దాని గురించి తగినంత అవగాహన కూడా లేదు. అందువల్ల, చాలా మంది భారతీయులు వారి వైద్య సంరక్షణ ఖర్చులను వారి స్వంత జేబుల నుండి చెల్లిస్తారు.

అయితే, గత కొన్నేళ్లుగా, భారతీయులు తమ వైద్య చికిత్సలను కవర్ చేయడానికి కొన్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఇంటర్నెట్ వాడకం మరియు సోషల్ మీడియా ప్రాచుర్యం అనేది ఎక్కువ మందికి వాళ్ళకి కు లేదా వారి కుటుంబ సభ్యులకు క్రౌడ్ ఫండ్ చికిత్సకు వెళ్లే వీలు కల్పించింది.

నిధుల సేకరణకు మీకు ఉపయోగపడగల కొన్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంలు క్రింద ఇవ్వబడ్డాయి:

 • కెట్టో: భారతదేశంలో క్రౌడ్ ఫండింగ్ యొక్క అతిపెద్ద వేదికలలో కెట్టో ఒకటి. కెట్టో నిధుల సమీకరణకు ప్రత్యేకమైన నగదు పికప్ సదుపాయాన్ని అందిస్తుంది మరియు సేకరించిన నిధులలో 5-8% వసూలు చేస్తుంది లేదా చెల్లింపు గేట్వే ఛార్జీలతో పాటు 30 డాలర్లు  (వ్యక్తిగతంగా మరియు కార్పొరేట్ల విషయంలో ఏది ఎక్కువ అయితే అది) వసూలు చేస్తుంది. ఈ ప్లాట్‌ఫాం ఇప్పటివరకు 10,000 కు పైగా ప్రాజెక్టులకు మద్దతుగా 100,000 మందికి పైగా మద్దతుదారుల ద్వారా 5,990,400 డాలర్లను సహాయం చేయగలిగింది.
 • బిట్‌గివింగ్: ఆర్ట్ మరియు సోషల్ ప్రాజెక్ట్స్ వంటి వివిధ ప్రాజెక్టులకు క్రౌడ్‌ఫండ్స్‌ను రూపొందించడానికి బిట్‌గివింగ్ 2013 లో స్థాపించబడింది. దాదాపు 15% ప్రచారాలు క్యాన్సర్ చికిత్సలపై ఉంటాయి. అర్ధించేవారు లాభాపేక్షఉన్నవారా లేని వారా, వ్యక్తులలా, సంస్థలా లేదా కార్పొరేట్‌లా అనేదానిపై ఆధారపడి బిట్‌గివింగ్ నిధుల మొత్తంలో 6-10% కమీషన్ వసూలు చేస్తుంది.
 • ఇంపాక్ట్ గురు: ఇంపాక్ట్ గురు అనేది కూడా ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్. ఇది 2014 లో స్థాపించబడింది. ఆరు దేశాల నుండి 100 కి పైగా కారణాలు మరియు సంస్థలు ఇంపాక్ట్‌గురు ప్రచారాల ద్వారా ప్రయోజనం పొందాయి. ఇంపాక్ట్ గురుపై ప్రచారం ప్రారంభించడం ఉచితం. కానీ, నిధుల సమీకరణ పోర్టల్‌లో డిఫాల్ట్ప్యాకేజీని ఎంచుకుంటే మాత్రం వారు లావాదేవీల ఖర్చులతో పాటు 5% రుసుమును వసూలు చేస్తారు.

క్రౌడ్ ఫండింగ్ వనరులతో పాటు, క్యాన్సర్ మరియు ఇతర క్లిష్టమైన అనారోగ్య చికిత్సలో ప్రజలకు సహాయపడే కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి:

 • ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్: ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న కుటుంబాలకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి సహాయం ఇవ్వబడుతుంది. అయితే ఈ నిధిలో కొంత భాగం క్యాన్సర్‌తో సహా వైద్య చికిత్సల కోసం కూడా కేటాయించబడింది. పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌తో ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రుల జాబితా పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ వెబ్‌సైట్‌లో విడిగా పోస్ట్ చేయబడింది. దీనిని గ్రాంట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారు సూచన కోసం ఉపయోగించవచ్చు.
 • ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి: అనేక రాష్ట్రాల్లో క్యాన్సర్ వంటి క్లిష్టమైన అనారోగ్యానికి, చికిత్స ఖర్చు భరించలేని వ్యక్తుల కోసం రాష్ట్రస్థాయి సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఆ యా రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
 • రాష్ట్ర ఆరోగ్య నిధి-ఆర్ఏఎన్ : ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రీయ ఆరోగ్య నిధి-ఆర్ఏఎన్ క్రింద ఆర్థిక సహాయం అందింస్తుంది.  దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రోగులు ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ పథకం ద్వారా సహాయం అందజేయబడుతుంది.

క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి ప్రజలకు సహాయపడే ఎన్జీఓలు మరియు ప్రైవేట్ ట్రస్టులు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి:

 • నర్గిస్ దత్ మెమోరియల్ ట్రస్ట్
 • అన్ క్యాన్సర్ ఇండియా
 • యువరాజ్ సింగ్ ఫౌండేషన్
 • ది ఇండియన్ క్యాన్సర్ సొసైటీ
 • ది క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్ అసోసియేషన్
 • ది క్యాన్సర్ కేర్ ట్రస్ట్
 • యోధాస్
 • ఫస్ట్ హ్యాండ్ ఫౌండేషన్

మీరు లేదా మీకు ప్రియమైన వ్యక్తి కానీ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లైతే , మీరు ఒంటరిగా చికిత్స ఖర్చులు భరించలేకపోతే పైన పేర్కొన్న వాటిల్లో దేనినుండి అయినా సహాయం పొందడానికి ప్రయత్నించవచ్చు.

Ask a question regarding క్యాన్సర్ చికిత్స కోసం నిధులు సేకరిస్తున్నారా? అయితే ఇవి ప్రయత్నించండి

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here