2 MIN READ

వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు శారీరకంగా మరియు సామాజికంగా
చురుకుగా ఉండటం ముఖ్యం. మొదట్లో, ఒకరు పని చేస్తున్నప్పుడు లేదా ఇంటిని
నిర్వహించేటప్పుడు, సాధారణ జీవనశైలి వారిని శారీరకంగా, మానసికంగా మరియు
సామాజికంగా చురుకుగా ఉంచుతుంది. కానీ వాళ్ళు పదవీ విరమణ వైపు
కదులుతున్నప్పుడు, వారి సామాజిక జీవితం చాలా కారణాల వల్ల వెనుకంజ
వేస్తుంది. ఇది వారి శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది.
సామాజిక ఒంటరితనం అనేది ఆరోగ్యాన్ని ప్రతికూల మార్గంలో ప్రభావితం
చేస్తుందని ఎన్‌సిబిఐలో ప్రచురించిన ఒక అధ్యయనం సూచిస్తుంది.
అంతేకాకుండా సామాజికంగా క్రియారహితంగా ఉండటం వల్ల నిరాశ కలగడం మరియు
వాళ్లు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం కూడా జరుగుతాయని ఆ అధ్యయనం
ప్రతిపాదించింది.
కనుక, మీ తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధ వయస్సులోకి ప్రవేశిస్తున్నప్పుడు,
మీరు వారి శారీరక శ్రేయస్సు మాత్రమే కాకుండా, వారి సామాజిక జీవనాన్ని
కూడా చూసుకోవాలి. మీ తల్లిదండ్రుల వయస్సు పైబడినప్పుడు వారిని సంతోషంగా
ఉంచడానికి మరియు వారిని ఇంట్లో నిమగ్నమయ్యేలా చేయడానికి కొన్ని
మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
వాళ్ళు ఉపయోగం కలవారన్న భావనను వాళ్ళకు ఇవ్వండి
ఇంటి వెలుపల అయినా, లోపల అయినా ఒక ప్రయోజనం కోసం దోహదం
చేస్తున్నారనే అనుభూతిని అందరూ ఇష్టపడతారు. మన తల్లిదండ్రులు వారి
వృద్ధ వయస్సులోకి ప్రవేశించినప్పుడు, వాళ్లకు ఒత్తిడి లేకుండా ఉండటానికి
మనం వారికి ఎటువంటి బాధ్యతలను ఇవ్వము. కానీ వాళ్లవల్ల ఉపయోగం లేదు అనే
భావన వారిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అందువల్ల, వాళ్లకు కొన్ని
భాద్యతలు అప్పగించడం అన్నది చాలా మేలు చేస్తుంది. అది తోటపని, పిల్లకు
పాఠాలు చెప్పడం, ప్రత్యేక భోజనం వండటం లేదా ఇంకేవైనా సరే వాళ్ళకి
వాళ్ళు ఉపయోగం ఉన్నవారు అని అనిపించే ఏదైనా బాధ్యతలు కావొచ్చు.

జనాలను కలుస్తూ ఉండండి
వృద్దులలో ఒంటరితనం సాధారణం. మరియు దానివల్ల నిరాశ కలగడం లేదా
జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబంగా మీరు క్రమం
తప్పకుండా జనాలని కలుస్తూ ఉండేలా చూసుకోవడం ద్వారా వారి సామాజిక
జీవితాన్ని చురుకుగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. మీరు కుటుంబ పునఃకలయికలు,
విందులు, విహారయాత్రలు మొదలైనవాటిని ప్లాన్ చేయవచ్చు మరియు మీ
తల్లిదండ్రులుని సొసైటీ క్లబ్‌లు, రీడింగ్ క్లబ్‌లు, యోగా క్లాసులు
మొదలైన వాటిలో పాల్గొనేలా చేయటం ద్వారా వారి సామాజిక జీవితాన్ని
చురుకుగా ఉంచొచ్చు.
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండటానికి మీ తల్లిదండ్రులను ప్రోత్సహించడం అనేది వారిని
సాంఘికీకరించడంలో సహాయపడటమే కాక, అది వారిలో అనారోగ్యాల
ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వారు నడకకు, యోగా సెషన్లు లేదా
వ్యాయామ దినచర్యలకు బయలుదేరినప్పుడు, వారు కొత్త వ్యక్తులను
కలుస్తారు అలా వారికి ఒక స్వంత సామాజిక వృత్తం తయారవుతుంది.
వాళ్ళతో మాట్లాడండి
ఒంటరితనాన్ని పోగొట్టడానికి సంభాషణ అనేది ఉత్తమ మార్గం. మీ ఉరుకుల
పరుగుల జీవితంలో మీరు ఇంట్లో తక్కువ సేపు ఉండడం అనేది మీ తల్లితండ్రుల్లో
ఒంటరితనాన్ని పెంచుతుందని మీరు గ్రహించలేకపోవచ్చు. అందుకే వారితో
వీలున్నప్పుడల్లా మాట్లాడం మంచిది. మీరు పనినుంచి ఇంటికి వచ్చాక కాసేపు
వారితో ముచ్చటించండి, వారి య్యోగక్షేమాలు అడిగి తెలుసుకోండి, భోజనం
సమయాల్లో కలిసి తినండి.అంతేకాకుండా, మీరు వారితో కాసేపు నడవచ్చు లేదా
లాంగ్ డ్రైవ్ లాంటివి చేస్తూ హృదయపూర్వక సంభాషణ చేయవచ్చు. అలగే మీరు
పనిలో బిజీ గా ఉన్నప్పుడు కూడా మధ్యాహ్న భోజన సమయాల్లో అలా వాళ్ళతో
ఫోన్ చేసి మాట్లాడవచ్చ.
వాళ్ళని ఏదైనా అభిరుచిలో పాల్గొనేలా చేయండి
వృద్ధులను కాలక్షేపం అయ్యేలా చేయడానికి మరొక మార్గం ఏమిటంటే వారు
కోరుకునే అభిరుచిలో వాళ్ళని పాల్గొన నివ్వడం.అది చదవడం కానీ, పెయింటింగ్

కానీ, మ్యూజిక్ సెషన్స్ లేదా వంట అయినా కావొచ్చు. ఒక అభిరుచి అనేది
వాళ్ళని బిజీగా ఉంచడమే కాకుండా, అది జ్ఞాపకశక్తి ని పెంచడంలో మరియు
మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
ఆటలు ఆడండి
ఇంట్లో పరస్పర వాతావరణాన్ని ఉంచడానికి, ప్రతి ఒక్కరి మానసిక స్థితిని
పునరుద్ధరించడానికి మీరు ఇంట్లో బోర్డు ఆటలు, క్యారమ్ లేదా ఇతర ఆటలను
ఆడవచ్చు. జ్ఞాపకశక్తి నైపుణ్యాలను పదును పెట్టడానికి మరియు మానసికంగా
చురుకుగా ఉండటానికి సహాయపడే మెదడును ఉత్తేజపరిచే ఆటలు చాలా ఉన్నాయి.
వాళ్ళ యొక్క వృద్ధ వయస్సులో తల్లిదండ్రులు బలహీనమైన స్థితిలో
ఉంటారు మరియు జాగ్రత్తగా చికిత్స చేయకపోతే అనారోగ్యానికి గురవుతారు.
అందువల్ల కుటుంబంగా, వారి ప్రపంచంలో చిన్న సానుకూల మార్పు మరియు వారి
పట్ల మీ వైఖరి వారి ఆరోగ్య విషయంలో అద్భుతాలు చేయగలవు.

Ask a question regarding తల్లితండ్రులను సంతోషంగా మరియు ఇంటి దగ్గర ఉంచడం ఎలా

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here