1 MIN READ

ఆస్టియోమెలేసియా ఎముకలను మృదువుగా చేస్తుంది, ఇది తరచుగా విటమిన్ డి యొక్క తీవ్ర లోపం వల్ల వస్తుంది. ఆస్టియోమలాసియా అనేది , యువకులలో ముఖ్యంగా పిల్లలు పెరిగే సమయంలో వొంగిపోవడానికి దారితీస్తుంది.పెద్దవారిలో, ఇది విరుగుళ్లకు దారితీస్తుంది. ఎముకలు సన్నబడటానికి కారణమవుతున్నందున ఓస్టీయో పోరోసిస్(బోలు ఎముకల వ్యాధి) నుండి ఆస్టియోమెలేసియా(అస్తిమాల్యం వ్యాధి)  భిన్నంగా ఉంటుంది.

ఎముకలను బలోపేతం చేయడానికి మరియు అవి గట్టిపడటానికి కాల్షియం మరియు విటమిన్ డి ఎక్కువ తీసుకునేలా చేయడం పై  ఆస్టియోమెలేసియా చికిత్స ప్రధానంగా దృష్టి పెడుతుంది.

శరీరం కాల్షియం మరియు ఫాస్ఫేట్‌ను తగినంతగా ఉపయోగించనప్పుడు పోషక ఆస్టియోమలాసియా తలెత్తుతుంది. అవి ఆహారం లో సరిగా తీసుకోకపోయి ఉండొచ్చు, లేదా శరీరం వాటిని సరిగా గ్రహించలేకపోవచ్చు. పోషక ఆస్టియోమెలేసియా క్రింది రెండు కారణాల వల్ల జరుగుతుంది:

  • విటమిన్ డి లోపం: ఇది బోలు ఎముకల వ్యాధికి అత్యంత సాధారణ కారణం. ఎండలో ఎక్కువగా బయటకు వెళ్లని వారిలో లేదా ఆహారంలో తగినంత విటమిన్ డి తీసుకోని వారిలో ఈ పరిస్థితి కలుగుతుంది.
  • ఉదరకుహర వ్యాధి: ఉదరకుహర వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక రుగ్మత. గోధుమలు, రై మరియు బార్లీలు తినడం వల్ల చిన్న ప్రేగు యొక్క పొరను  దెబ్బతీయొచ్చు. ఈ పదార్ధాలలో గ్లూటెన్ అని పిలువబడే ప్రోటీన్ ఉన్నందున ఇలా జరుగుతుంది. పేగు రేఖ దెబ్బతిన్నప్పుడు మరియు పోషకాలను బాగా గ్రహించలేనప్పుడు, అది ఆస్టియోమెలేసియాకి దారితీస్తుంది. 

పోషక ఆస్టియోమెలేసియాకు చికిత్స మార్గాలు ఏంటి?

తగినంత విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనిని రెండు విధాలుగా చేయవచ్చు:

  • విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం: మీ ఆహారంలో ఎక్కువ విటమిన్ డి చేర్చుకోండి. గుడ్డు సొన, పాలు, పెరుగు, నారింజ రసం మరియు జున్ను అనేవి విటమిన్ డి పుష్కలంగా లభించే ఆహారాలు. అలాగే, విటమిన్ డి పొందడానికి ఉదయం ఎండలో కొంత సమయం గడపండి.
  • కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి: జున్ను, పెరుగు, బీన్స్ కాయధాన్యాలు మరియు బాదం, కాల్షియం లాంటివి తీసుకోవడం వల్ల మీ శరీరం లో క్యాల్షియం స్థాయి పెరుగుతుంది. మీ వైద్యుడితో చర్చించి మీరు కొన్ని కాల్షియం మందులు కూడా తీసుకోవచ్చు.
  • విటమిన్ డి సప్లిమెంట్స్: మీరు మీ డైట్‌లో అవసరమైన విటమిన్ డి ని మీరు పొందలేకపోతుంటే, లేదా మీ శరీరం దానిని గ్రహించలేకపోతే, మీరు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. మీ వైద్యుడుని సంప్రదించి వారి సలహా మేరకు మీకు సరిపడే సప్లిమెంట్ ను తీసుకోండి.  

మీరు సరైన మోతాదులో విటమిన్ డి తీసుకునేట్లు చూసుకోవడం ద్వారా పోషక ఆస్టియోమెలేసియాను నివారించవచ్చు. మీ వృద్ధాప్యంలో ఈ పరిస్థితిని అరికట్టడానికి మీ 30 ఏళ్ళ నుండే దీని మీద శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఆ వయస్సు లోనే ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.

Ask a question regarding పోషక ఆస్టియోమలాసియా యొక్క చికిత్స

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here