3 MIN READ

అల్జీమర్స్ వ్యాధి అనేది చిత్తవైకల్యం యొక్క అత్యంత సాధారణ
రూపాలలో ఒకటి. క్రమంగా జ్ఞాపకశక్తి ని కోల్పోవడం మరియు కొన్నిసార్లు
పూర్తిగా కోల్పోవడం వంటి లక్షణాలను ఇది ప్రదర్శిస్తుంది. ఆలోచన, భాష
మరియు ప్రవర్తన వంటి అభిజ్ఞా సామర్థ్యాలకు అల్జీమర్స్ ఆటంకం
కలిగిస్తుంది. అల్జీమర్స్ మెదడు యొక్క క్షీణత కారణంగా సంభవిస్తుంది.
దాదాపు 60-80 శాతం చిత్తవైకల్యం కేసులకు ఇది కారణమవుతుంది.

భారతదేశంలో అల్జీమర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇప్పుడు
చూద్దాం :
దగ్గర దగ్గర 1.6 మిలియన్ల మంది
భారతీయులకు అల్జీమర్స్ ఉంది.
భారతదేశ జనాభాలో 4 మిలియన్లకు పైగా వివిధ రకాల చిత్తవైకల్యంతో
బాధపడుతుండగా, 1.6 మిలియన్ల మంది అల్జీమర్స్ బారిన పడ్డారు. మరియు ప్రతి
20 సంవత్సరాలకు ఈ సంఖ్యలు రెట్టింపు అవుతాయని కింగ్స్ కాలేజ్ లండన్
నేతృత్వంలోని వరల్డ్ అల్జీమర్స్ రిపోర్ట్ 2015 అంచనా వేసింది. ప్రతి 3
సెకన్లకు అల్జీమర్స్ యొక్క క్రొత్త కేసు పెరుగుతున్నట్టు ఫలితాల్లో
వెల్లడైంది.
అల్జీమర్స్ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా
(ఏఆర్డిఎస్ఐ) ప్రచురించిన ‘డిమెన్షియా ఇండియా’ నివేదిక ప్రకారం, కేవలం
ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రమే 2026 నాటికి
5,00,000 మందికి పైగా రోగులు ఉండొచ్చని ఒక అంచన!
చాలా కేసులు గుర్తుగించబడలేదు

లక్షణాలపై అవగాహన లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో అల్జీమర్స్ కేసులు
గుర్తించబడలేదు. ఈ లక్షణాలు గమనించినప్పటికీ, ఇది సాధారణ వృద్ధాప్య
ప్రక్రియలో ఒక భాగమని ప్రజలు అనుకుంటారు.

మెదడు కణాల నష్టం లేదా మెదడు కణాల మరణం వల్ల అల్జీమర్స్
సంభవిస్తుంది. అమిలాయిడ్ బీటా ప్రోటీన్ యొక్క పెద్ద నిక్షేపాలు ఉండటం
వల్ల మెదడు కణాల మరణం తరచుగా జరుగుతుంది. మెదడులోని న్యూరాన్ల మధ్య
ప్రోటీన్ కలిసిపోయినప్పుడు ఈ అంటుకునే నిక్షేపాలను ఫలకాలు అని కూడా
అంటారు. నిక్షేపాలు ఒకదానికొకటి కణ కనెక్షన్లకు అంతరాయం కలిగిస్తాయి, ఇవి
కణాలకు నష్టం కలిగిస్తాయి మరియు చివరికి మెదడు కణాల మరణానికి
కారణమవుతాయి.
ఇది ఒక్కసారిగా కాకుండా మెల్లగా జరుగుతుంది కాబట్టి, అల్జీమర్స్ యొక్క
లక్షణాలు ఎక్కువగా గుర్తించబడవు. అలాగే, జ్ఞాపకశక్తికి భంగం కలగడం, చిరాకు
మరియు ప్రవర్తనా మార్పులు, తెలిసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది,
వస్తువులను పోగొట్టుకోవడం, మానసిక స్థితిలో మార్పులు మరియు సామాజిక
కార్యకలాపాల నుండి వైదొలగడం వంటివాటిని వయస్సు ప్రకారం వచ్చేవిగా
భావించి కుటుంబ సభ్యుల వీటిని సాధారణమైనవిగా అనుకోవచ్చు.
వయస్సు పెరిగేకొద్దీ అల్జీమర్స్ వచ్చే
సంభావ్యత కూడా పెరుగుతుంది

ఈ వ్యాధి సాధారణంగా 65 ఏళ్ళ వయస్సు పైబడ్డాక సంభవిస్తుంది మరియు
మీరు 65 దాటిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ అల్జీమర్స్ వచ్చే
అవకాశం రెండు రెట్లు ఎక్కువ అవుతుంది. లక్షణాల ప్రదర్శన, చాలా భిన్నంగా
ఉంటుంది. చాలా తరచుగా, 60 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రజలలో దీని
లక్షణాలు కనిపిస్తాయి. అయినప్పటికీ, అల్జీమర్స్ యొక్క ప్రారంభ
సంకేతాలు 40 మరియు 50 ల వయస్సు ఉన్నవారిలో కూడా కనిపిస్తాయని గమనించడం
ముఖ్యం. దీనిని అల్జీమర్స్ యొక్క ప్రారంభ ఆగమనం అని పిలువబడుతుంది

మరియు క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, వస్తువులను పోగొట్టుకోవడం,
తెలిసిన పనులు పూర్తి చేయడంలో ఇబ్బంది మరియు వ్యక్తిత్వ మార్పులు వంటి
లక్షణాలను ప్రదర్శించే జన్యు సిద్ధత కలిగిన బలమైన కుటుంబ చరిత్రను కలిగి
ఉంది.
మహిళల్లో అధిక నిష్పత్తిలో అల్జీమర్స్
వ్యాధి ఉంది

మహిళల్లో, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో అల్జీమర్స్ ఎక్కువగా
ఉన్నట్లు 'ది డిమెన్షియా ఇండియా రిపోర్ట్ 2010' పేర్కొంది. 2015 లో
ప్రచురించబడిన డబుల్యూ హెచ్ ఓ డేటా ప్రకారంపురుషుల కంటే మహిళలలకు
ఎక్కువ ఆయుర్దాయం ఉండటం మూలాన పురుషులకంటే మహిళలు ఎక్కువ అల్జీమర్స్
బారిన పడుతున్నారు. మహిళల ఆయుర్దాయం 69.9 ఉంటే, పురుషులలో ఇది 66.9 గా
ఉంది. మహిళలలో వయస్సు పైబడ్డాక వాళ్ళని పురుషుల మాదిరిగా చూసుకోరు.
అందువల్ల వారు ఎక్కువ కాలం వైకల్యం మరియు అనారోగ్యం అనుభవిస్తూ
బ్రతుకుతారు.
అల్జీమర్స్ కోసం ఆరోగ్య సంరక్షణ సేవల
ఖర్చు
భారతదేశంలో వృద్ధుల జనాభా 3 శాతం చొప్పున చాలా వేగంగా పెరుగుతోందని
ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2017 పేర్కొంది. అంటే ఒక విధంగా భారతదేశంలో
అల్జీమర్స్ కేసులు పెరగబోతున్నాయి అనమాట! ప్రస్తుతం, అల్జీమర్స్
ఉన్నవారిని చూసుకోవటానికి వార్షిక గృహ వ్యయం పట్టణ ప్రాంతాలలో 45,600
రూపాయలు నుండి 2,02,450 రూపాయలు ఉంది. మరియు గ్రామీణ ప్రాంతాల్లో 20,300
రూపాయలు నుండి 66,025 రూపాయలు మధ్య ఉంటుంది. అల్జీమర్స్ కోసం ఆరోగ్య
సంరక్షణ మరియు చికిత్సలో ఖర్చులు 2030 నాటికి మూడు రెట్లు పెరుగుతాయని
అంచనా వేయడం జరిగింది.
భారత ప్రభుత్వం, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వృద్ధుల కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం యొక్క అపెండిక్స్ V,
అల్జీమర్స్ / చిత్తవైకల్యంతో బాధపడుతున్న సీనియర్ సిటిజన్ల కోసం డే

కేర్ సెంటర్లను నడపాలని సూచించింది మరియు దీనికయ్యే వైద్య సంరక్షణ
ఖర్చును పేర్కొంది.
ప్రమాద కారకాలు
అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచడంలో పెద్ద పాత్రను పోషించే అనేక అంశాలు
ఉండవచ్చు. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా జాబితా చేయబడతాయి:
 వయస్సు
 కుటుంబ చరిత్ర మరియు వారసత్వం
 తలకి గాయం, పదేపదే గాయం కావడం లేదా స్పృహ కోల్పోవడం
 గుండె జబ్బులు, గుండె నొప్పి
 అధిక రక్త పోటు
 ఊబకాయం
 డయాబెటిస్ (ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతుందని
చెబుతారు)
 అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు
 ధూమపానం
మందులు సహాయపడతాయి కానీ, అల్జీమర్‌కు శాశ్వత చికిత్స మాత్రం లేదు. మీ
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరియు మానసికంగా మరియు
సామాజికంగా చురుకుగా ఉండటం ఖచ్చితంగా అల్జీమర్స్ లక్షణాలను
తగ్గించడంలో సహాయపడుతుంది. అభిరుచిని కొనసాగించడం, పజిల్స్ పరిష్కరించడం,
కొత్త భాష నేర్చుకోవడం వంటి వాటి ద్వారా మానసికంగా చురుకుగా ఉండటం
మెదడును ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. చురుకుగా మరియు అప్రమత్తంగా
ఉండటం ఈ రెండింటితో కలిసిన ఉద్దీపన అనేది అల్జీమర్స్ ప్రమాదాన్ని
నేరుగా ఆలస్యం చేయదు లేదా తగ్గించదు, కానీ దాని లక్షణాల ప్రదర్శనను
ఆలస్యం చేస్తుంది.

Ask a question regarding భారతదేశంలో అల్జీమర్స్ యొక్క ముఖ్య వాస్తవాలు మరియు గణాంకాలు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here