2 MIN READ

వృద్ధాప్యంలో మీ శరీరం బలహీనంగా మారుతుంది మరియు వివిధ ఇన్ఫెక్షన్ల
నుండి రోగనిరోధకతను కూడా కలిగి ఉండదు. ఈఇన్ఫెక్షన్ లు బ్యాక్టీరియా,
శిలీంధ్రాలు లేదా వైరస్ లేదా దోమ కాటు వల్ల కూడా సంభవిస్తాయి. మరియు
వృద్ధాప్యంలో ఈ ఇన్ఫెక్షన్స్ ని వ్యవహరించడం కష్టమవుతుంది.
ఎందుకంటే మీరు ఆ వయస్సులో ఇతర సమస్యల కోసం వేరే మందులు వాడుతూ
ఉంటారు. కాబట్టి, మీరు అనారోగ్యం పాలవ్వకుండా, మీ ఇంటిని శుభ్రంగా మరియు
సంక్రమణ రహితంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం.
మీ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉంచడానికి ఈ క్రింది
చిట్కాలు మీకు సహాయపడతాయి:
మీ ఇంటిని శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందును
వాడండి
దగ్గు మరియు జలుబు, ఫ్లూ మరియు కడుపు నొప్పి వంటి వ్యాధులు వైరస్లు వల్ల
వస్తుంటాయి. ఇవి ఒకరినుంచి ఒకరి సంక్రమిస్తాయి. స్పర్శ మరియు గాలి కణాల
ద్వారా వ్యాప్తి చెందుతాయి. మీ ఇంట్లో పరిశుభ్రత కొరకు ఈ క్రింది
చర్యలను పాటించండి:
 నేలను శుభ్రంగా ఉంచడానికి వేడి నీటిలో కలిపిన అధిక-నాణ్యత
క్రిమిసంహారక క్లీనర్ ను ఉపయోగించండి.
 గాలిని తాజాగా మరియు శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక ఎయిర్
స్ప్రేని ఉపయోగించండి.

 హ్యూమిడిఫైయర్ క్రీములను అంతమొందించగలదు. ముఖ్యంగా
వర్షాకాలంలో అది అద్భుతాలను చేయగలదు.
వంటగది కోసం పునర్వినియోగపరచలేని బట్టలు మరియు
తువ్వాళ్లను ఉపయోగించండి
తడిసిన వంటగది తువ్వాళ్లు మరియు స్నానపు తువ్వాళ్లు మీరు ఊహించిన
దానికంటే వేగంగా సూక్ష్మక్రిములను వ్యాప్తి చేస్తాయి.
పునర్వినియోగపరచలేని బట్టలు మరియు తువ్వాళ్లను ఉపయోగించడం అనేది
మేలైన పని. శుభ్రమైన మరియు పొడి వంటగది న్యాప్‌కిన్లు కిచెన్
ప్లాట్‌ఫాం ని ఇన్‌ఫెక్షన్ లేకుండా ఉంచటానికి సహాయపడతాయి.ఆ విధంగా అది,
ఆహారం ద్వారా బ్యాక్టీరియాను వ్యాప్తి చెందకుండా చేస్తుంది. కిచెన్
ప్లాట్‌ఫామ్‌ను శుభ్రపరచడానికి మైక్రోఫైబర్ బట్టలు అద్భుతమైనవి
ఎందుకంటే అవి ఎక్కువ నీటిని గ్రహించవు మరియు ఎక్కువరోజులు ఉంటాయి.
వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించండి
వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం వల్ల తివాచీలు, సోఫా సెట్లు మరియు
దుప్పట్లపై పేరుకుపోయిన దుమ్ము కణాలను శుభ్రపరచవచ్చు. మీ వాక్యూమ్
క్లీనర్ యొక్క ఫిల్టర్లు సరిగ్గా పనిచేసేలా చూసుకోండి మరియు వాటిని
అప్పుడప్పుడు క్రమంగా మార్చండి లేదా శుభ్రపరచండి.
మీ బాత్రూమ్ ను శుభ్రంగా ఉంచుకోండి
బాత్రూమ్లో ఇన్ఫెక్షన్స్ కలగడానికి అధిక ప్రమాదం ఉంటుంది.
బాత్రూమ్లో సూక్ష్మ క్రీములు లేకుండా ఉండటానికి నాణ్యమైన బాత్రూమ్
క్లీనర్ ను లేదా డిటర్జెంట్‌తో వేడి నీటితో వారానికి కనీసం రెండుసార్లు మీ
బాత్రూమ్ ను శుభ్రం చేసుకోండి.
ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి టాయిలెట్ సీటును శుభ్రం
చేయడానికి క్రిమిసంహారక తొడుగులు వాడండి. బాత్రూంలో ఉపయోగించడానికి
ప్రత్యేక తువ్వాళ్లను పెట్టుకోండి. మీ చేతులను శుభ్రంగా ఉంచుకోడానికి
హ్యాండ్ క్లీనర్ ను వాడండి. అవసరమైతే, బాత్రూంలో ప్రత్యేక
డస్ట్‌బిన్ ను ఉపయోగించండి.

పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి
మనం మన ఇంటిని బాగా చూసుకుంటాము. కానీ మన పరిసరాల సంగతేంటి? వాటిని
శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోడానికి మనం ప్రయత్నిస్తున్నామా?
అపరిశుభ్రమైన పరిసరాలు అనేవి వ్యాధులు మరియు అంటువ్యాధుల వ్యాప్తికి
కూడా కారణమవుతాయి. చెత్తను మీ చుట్టుపక్కల కాకుండా చెత్త కుండీలలో
వేయండి.
దోమతెరలను వాడండి
మలేరియా మరియు డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కిటికీ వద్ద
దోమతెరలను ఏర్పాటు చేసుకోండి. తొట్టెలలో మరియు బకెట్ లలో నీటిని
ఎక్కువ సమయం నిలువ ఉంచకండి. ఎందుకంటే అది దోమలకు జన్మ స్థలాల్లా
వ్యవహరిస్తాయి.
నీటి ఫిల్టర్లు
మీ వాటర్ ఫిల్టర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సరి చూసుకోండి.
సురక్షితమైన తాగునీటి కోసం వాటిని తరచుగా మార్చండి లేదా మరమ్మత్తు
చేయండి. మీ తాగునీటి ట్యాంక్‌ను ఎప్పుడూ కప్పి ఉంచండి. బిపిఏ రహితం కాని
ప్లాస్టిక్ సీసాలు మరియు డబ్బాలను ఉపయోగించడం మానుకోండి.
పరిశుభ్రత అనేది ఒక సంస్కృతి లాంటిది వ్యాధులను దూరంగా ఉంచడానికి దాన్ని
చాలా చిత్తశుద్ధితో పాటించాలి. పైన పేర్కొన్న చిట్కాలు మీ ఇంటిని
శుభ్రంగా, చక్కగా మరియు సంక్రమణ లేకుండా ఉంచడానికి సహాయపడతాయి.

Ask a question regarding మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మీ ఇంటిని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here