2 MIN READ

బహుశా మన దేశంలోని పాత తరం వారు వారి జీవితాలను గడపడానికి అనుసరించే
తత్వశాస్త్రం ఇదే కావొచ్చు. లేకపోతే నేటి యువతరం లో లేని సంతృప్తి మరియు
ఆనందాన్ని వాళ్ళు ఎలా పొందుతున్నారంటారు?
50 ఏళ్ళ ఆరంభం నుండి వారి 60 మరియు 70 సంవత్సరాలల్లో ఇంకా ఆ పై వయస్సు
పెరిగేకొద్దీ జనాల్లో సంతృప్తి కూడా పెరుగుతుందని అధ్యయనాల్లో చాలా
బలంగా వెల్లడైంది. కానీ వారి మధ్యవయస్సులో మాత్రం వాళ్ళ సంతోషం లేదా
ఆనందం కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ‘మిడ్-లైఫ్ సంక్షోభం’ అనే పదం దీనికి
కారణం కావచ్చు, యువతరం మరియు మధ్యవయస్కులు కంటే పాత తరం వాళ్ళు ఎందుకు
సంతోషంగా ఉన్నారు అనేదానికి కచ్చితమైన వివరణ లేకపోయినప్పటికీ, ఆ ఆనందాన్ని
మనమందరం ఎల్లప్పుడూ అనుభవించాలని మాత్రం కోరుకుంటుంటాము.
ఆ ఆనందాన్ని పొందటం ఎలా? ఆ ఆనందాన్ని పొందాలంటే 60సంవత్సరాల వయస్సు
వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. నిజంగా సంతోషంగా ఉండటానికి 60 ఏళ్లు
ఉండటానికి మేము వేచి ఉండాల్సిన అవసరం లేదు.
మన పాతతరం వాళ్ళు భిన్నంగా ప్రయత్నించే, మనం కూడా పాటించగల విషయాలు:

1. వాళ్లు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు: యువతరం సాధారణ
విషయాలలో కూడా కొత్తదనం మరియు అసాధారణమైనవాటి కోసం చూస్తూ చిన్న చిన్న
విషయాలలోని ఆ అద్భుతాల్ని కోల్పోతుంటారు. క్రొత్త వంటకాలు
ప్రయత్నించడం లేదా పాత స్నేహితుడిని సందర్శించడం లాంటి చిన్న చిన్న
వాటిల్లో మన పెద్దలు ఆనందం పొందుతారు. వారు థ్రిల్‌ని కోరుకోరు కానీ ప్రతి
క్షణం అందించే ప్రశాంతతను ఆనందిస్తారు. వారు నిజంగా ప్రతి క్షణాన్ని
అద్భుతంగా ఆస్వాదిస్తారు.

దానికొరకు మీరు ఏమి చేయగలరు: మీరు ప్రతిరోజూ ఆనందంతో జీవించడాన్ని
నేర్చుకోవచ్చు మరియు ఆనందాన్ని అనుభవించే అవకాశంగా ప్రతి క్షణాన్ని
ఆస్వాదించొచ్చు. ఆనందం అనేది ఒక అంతర్గత విషయం దానికోసం బయట ఎక్కడో
ప్రాకులాడవద్దు.

2. వారు అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరచుకుంటారు: పాత తరం వారికి తక్కువ
స్నేహితులు ఉండేవారు కానీ నిజమైన స్నేహితులు ఉన్నారు. వారు పైపైన సంబంధాలను
ఏర్పరుచుకోవడానికి బదులుగా అర్ధవంతమైన సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారు నిజంగా
ముఖ్యమైన వాటికోసం సమయాన్ని కేటాయిస్తారు.

దానికొరకు మీరు ఏమి చేయగలరు: అర్ధవంతమైన సంబంధాలను ఏర్పరుచుకోండి మరియు
ముఖ్యమైన వ్యక్తుల కోసం సమయాన్ని కేటాయించండి. ఫోన్ ల ద్వారా కానీ
లేదా ఉత్తరాల ద్వారా కానీ వారితో కనెక్ట్ అవ్వండి మరియు వాటిని మీ
జీవితంలో భాగం చేసుకోవాలని నిర్ధారించుకోండి.

3. వారు స్వచ్ఛందంగా పనిచేస్తారు: వాలంటీర్ గా ఒక ఎన్జిఓతో కలిసి సహాయం
చేయడం లేదా, అవసరం లో ఉన్న స్నేహితుడికి సహాయం చేయడం ఇలా వాళ్ళు
ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. స్వచ్చంద సేవ అనేది
డిప్రెషన్ ను తగ్గిస్తుందని మరియు ప్రజలలో సాధారణ శ్రేయస్సు యొక్క
భావనను పెంచుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. స్వచ్ఛందంగా పనిచేసే
వ్యక్తులు కొత్త సంబంధాలను కూడా కలుపుకుంటుంటారు, ఇది ఆనందాన్ని
పెంపొదిస్తుంది .
దానికొరకు మీరు ఏమి చేయగలరు: మీ వ్యక్తిత్వానికి మరియు ఆసక్తికి తగిన
స్వయంసేవక కార్యాచరణను ఎంచుకోండి. మీరు మీ కుటుంబ సభ్యుడికి లేదా అవసరంలో
ఉన్న స్నేహితుడికి కూడా సహాయపడవచ్చు.

4. వారు కష్టపడటాన్ని ఇష్టపడతారు: ఏదైనా వంట చేయడంలో కానీ, లేదా కిరాణా
కొనుగోలు చేయడంలో అయినా పాత తరం వాళ్ళు షార్ట్ కట్స్ ను నమ్ముకోరు.
టెక్-అవగాహన ఉన్న పెద్దలు కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడానికి బదులుగా
బయటకు వెళ్లి కూరగాయలను కొనాలని అనుకుంటారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు,
కొంతమందిని కలిసే అవకాశముంటుంది వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇది మీ
మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటానికి ఉపయోగపడుతుంది.

దానికొరకు మీరు ఏమి చేయగలరు: అప్పుడప్పుడు, బయటికి వెళ్లి సాధారణ పనులు
చేయటానికి సమయాన్ని కేటాయించండి. ప్రజలతో మీ మాటలని, సంబంధాల్ని
పెంచుకోండి మరియు ఒక పండు లేదా పువ్వును కొనే ముందు వాసన చూసే ఆనందాన్ని
అనుభవించండి.
స్నేహితులతో సంభాషణలు, మీరు వాసన చూసే పువ్వులు, మీరు ఏర్పరచుకున్న సంబంధాలు
మరియు మీరు సహాయపడే వ్యక్తులలో మీ వయస్సును లెక్కించండి. వయస్సు అనేది
కేవలం ఒక అంకె మాత్రమే, మీరు సరిగ్గా జీవించినప్పుడు, ఆ అంకెల గురించి
పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదు.

Ask a question regarding మనం మనస్సు యవ్వనంగా పరిగెత్తుతుంటే, మనం వృద్ధులం ఎలా అవుతాం?

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here