2 MIN READ

జీవితంలో చాలా అందమైన విషయాలలో ఒకటి వృద్ధాప్య వయస్సు రావడం. కానీ
వృద్ధాప్యం, వస్తూ వస్తూ దానితో పాటు, మన జీవితంలోని దాదాపు అన్ని
రంగాలలో చాలా మార్పులను తెస్తుంది. అలాంటి ఒక ప్రాంతం సెక్స్ జీవితం.
కొంతమంది పురుషులకి వయస్సు పెరిగాక కూడా వారిలోని లైంగిక కోరికలు తగ్గవు.
వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని
ఆస్వాదించవచ్చు. అయినప్పటికీ, వయస్సు పెరిగే కొద్దీ వాళ్ళ శరీరాలు
కొన్ని మార్పులకి మరియు అసౌకర్యానికి గురవుతాయి కానీ ప్రతిదాన్ని సరైన
జ్ఞానం మరియు మార్గదర్శకత్వంతో నిర్వహించవచ్చు. వృద్ధాప్యంలో
పురుషులు అనుభవించే రెండు ప్రధాన లైంగిక మార్పులు ఏవంటే:-
అంగస్తంభన సమస్య: అంగస్తంభన సమస్య ని సాధారణంగా ఈడి అని పిలుస్తారు.
అంగస్తంభన సాధించలేకపోవడం లేదా ఎక్కువ నిలబెట్టుకోలేకపోవడం లాంటి
సమస్య ఉంటుంది. ఒకవేళ అది జరిగినా, అంగస్తంభన మృదువైనదిగా మరియు తక్కువ
ఉద్వేగం శక్తితో భావప్రాప్తి ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ పురుషులు
ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య ఈడీ. క్రింద పేర్కొన్న కారణాల వల్ల ఈడీ
జరుగుతుంది:
 నరాల పనితీరు బలహీనపడడం
 టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం
 అంగస్తంభన కణజాలం యొక్క సాగుడు గుణం కాలక్రమేణా తక్కువ కావడం
 పురుషాంగంకు రక్త ప్రవాహం తగ్గడం
ఇవే కాకుండా, అనారోగ్యకరమైన జీవనశైలి కూడాఈడీ కి కారణమవుతుంది. గుండె
జబ్బులు, అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ వంటి వైద్య సమస్యలు కూడా
ఈడీ కి కారణమవుతాయి. అంగస్తంభనను నివారించడానికి ఉత్తమ మార్గం
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే. తగినంత వ్యాయామం చేయండి,
సరిగ్గా తినండి అలాగే ధూమపానం మరియు మద్యపానం వంటి హానికరమైన

అలవాట్లను వదిలివేయండి. మీరు ఇప్పటికే ఈ ఈడీ సమస్యతో
బాధపడుతున్నట్లైటే దాన్ని నిర్వహించడానికి ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి.
వయాగ్రా మరియు లెవిట్రా వంటి మందులు ఈడీ తో బాధపడేవారికి చాలా
సహాయకారిగా ఉంటాయి. వయాగ్రాకు స్పందించని వ్యక్తుల కోసం పురుషాంగం
ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. (దయచేసి ఏదైనా మందులు తీసుకునే
ముందు మీ వైద్యుడి సలహా తీసుకోండి).
లిబిడో తగ్గడం: లిబిడో లేదా లైంగిక కోరిక అనేది కొంతమందిలో వయస్సు పెరిగే
కొద్దీ క్షీణించడం ప్రారంభిస్తుంది. దానివల్ల పురుషులలో శృంగారాన్ని
ఆస్వాదించాలనే కోరిక కలుగదు. లిబిడో తగ్గుదలకు గల కారణాలు క్రింద
పేర్కొనబడ్డాయి:
 నిరాశ మరియు ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు
 గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి వైద్య ఆరోగ్య సమస్యలు
 శరీరంలో సెక్స్ హార్మోన్లు తగ్గడం
 మందులు
తక్కువ లిబిడోను సాధారణంగా మందుల ద్వారా నిర్వహించవచ్చు. మీ ఆరోగ్య
నిపుణులు ఏ మందులు తీసుకోవాలో మీకు మార్గనిర్దేశం చేయవచ్చు మరియు ఇతర
రోగాల మందులు మీ లిబిడో తగ్గడానికి కారణమైతే మీ వైద్యుడు మీ మందులని
మార్చవచ్చు.
వృద్ధాప్యం అంటే లైంగిక జీవితానికి స్వస్తి పలకమని కాదు. మీరు
ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించవచ్చు మరియు
మీకు నచ్చినంత కాలం ఈ అందమైన అనుభవాన్ని మీ భాగస్వామితో పంచుకోవచ్చు.
సరైన మార్గదర్శకంతో లైంగిక మార్పులను నిర్వహించండి మరియు
ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కొనసాగించండి.
డిస్క్లైమర్ : దయచేసి మీ వైద్యుడి సలహా లేకుండా ఎటువంటి మందులు
తీసుకోకండి. ఇలా చేయడం వల్ల తీవ్రమైన వైద్య సమస్యలు వచ్చే అవకాశం కలదు.

Ask a question regarding వయ స్సు పెరిగే కొద్దీ పురుషుల్లో సంభవించే లైంగిక మార్పులు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here