4 MIN READ

వీక్షించండి: బార్మెచా కుటుంబం శతాబ్ది క్లబ్‌లో చేరడానికి ఎలా లక్ష్యంగా పెట్టుకుంది?

సుదీర్ఘ కాలం వయస్సు వరకు ఆరోగ్యంగా జీవించడం అనేది ఒక ఘనత. ఒక వ్యక్తి వయస్సు 100 కు చేరువలో ఉంది అంటే, వారి దీర్ఘాయువు యొక్క రహస్యం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటాము. హ్యాపీఏజింగ్ పూణేలో అలాంటి ఒక కుటుంబాన్ని కలుసుకుంది, మా జట్టు వారి వంశాలలో శతాబ్దివారిని చూసింది. ఆరోగ్యంగా మరియు 90 దాటి జీవించడం ఈ కుటుంబానికి సాధారణ విషయం. జైన కుటుంబ మాతృకకు ఇప్పుడు 4 వ తరాన్ని చూసే అదృష్టం కలిగింది. మరియు దేవుని ఆశీర్వాదంతో, వారు 5 వ తరాన్ని కూడా త్వరలో చూడవచ్చు! వారి జీవనశైలి గురించి మరింత అర్థం చేసుకోవడానికి హ్యాపీఏజింగ్ వారిని సందర్శించారు. ఆ జీవనశైలి ఈ కుటుంబంలోని ప్రతి సభ్యునికి సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటానికి సహాయపడింది.

బార్మెచాలు

మిస్టర్ సురేష్ బార్మెచా (75) మరియు అతని భార్య చంచల్ బార్మెచా (69) ఇద్దరు పిల్లలు మరియు మనవరాళ్ళతో కూడిన కుటుంబం గల  వ్యక్తులు. ఆ కుటుంబ పెద్ద మిస్టర్ సురేష్ యొక్క తల్లి, 100 ఏళ్ల వయస్సు పైబడిన తరువాత కూడా ఇంకా ఆరోగ్యంగా ఉండి ఔరా! అనిపిస్తుంది.  ఆమెకు ఇంతవరకు కంటి చూపు సమస్య కోసం తప్ప ఇంతవరకు వేరే ఏ ఇతర సమస్య కోసం కూడా ఆసుపత్రి మెట్లు ఎక్కలేదు. గొప్ప జ్ఞాపకశక్తి మరియు పదునైన తెలివితో, ఈ శతాబ్ది తల్లి వారి మత ఉపవాస దినచర్యను పాటించగలదు మరియు జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించగలదు. బార్మెచా కుటుంబ సభ్యులందరి స్పూర్తి అలాంటిది మరి. ఇటీవల బార్మెచాస్ వారి ప్రేమగల తల్లి కోసం సోన్-కి-సిధి’ (గోల్డెన్ స్టెప్స్) ఉత్సవం జరిపారు. ఇది కుటుంబంలోని పెద్దవారు ఎవరైనా 3 తరాలను చూడగలిగినప్పుడు అనుసరించే సంప్రదాయం.

వీళ్ల వంశం మొత్తం 200 మందికి పైగా ఉన్నారు. ప్రతి పండుగ మరియు కుటుంబ కార్యక్రమాల సమయంలో, కుటుంబం మొత్తం కలిసి సరదాగా, సంతోషం తో  మరియు సమైక్యతతో ఆ వేడుకలో పాలుపంచుకుంటారు.

ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలి

మిస్టర్ మరియు మిసెస్ బార్మెచా వారి బాల్యాన్ని మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటూ మరియు శారీరక శ్రమ చేస్తూ గడిపినట్లు తెలిపారు. వారు తమ ఇళ్ళ వద్ద ఆవులు మరియు గేదెలను కలిగి ఉండేవారు. వారి పిల్లలకు కూడా స్వచ్ఛమైన పాలు, నెయ్యి మరియు వెన్న పెట్టి పెంచారు. వారి కుటుంబాలు వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొన్నాయి మరియు పిల్లలు కూడా దీనిలో భాగం అయ్యేలా వారు భావిస్తారు.

బయటి ఆహారం లేదా జంక్ ఫుడ్ ఊసే వాళ్ళ ఇంట్లో వినబడదు. కుటుంబంలో వాళ్ళు ఏది తినాలనుకున్నా సరే, స్వీట్స్‌తో సహా అన్నీ ఇంట్లోనే తయారుచేకుంటారు. ఇప్పుడు కూడా, ఈ కుటుంబం వారి పెద్ద కోడలు చేతికి వంటగది పగ్గాలను ఇచ్చి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇంట్లో తినడమే ఆనందిస్తారని ఆమె నిర్ధారిస్తుంది. ప్రతిదీ వారి స్వంత వంటగదిలో ప్రేమతో తయారు చేసుకోని ఇంట్లోనే తింటారు.

ఉద్యోగ సౌలభ్యం మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తుంది ఈ కాలంలో. ఇది ప్రజల నిశ్చల జీవనశైలికి తోడ్పడుతుంది, తద్వారా ప్రజలు చిన్న వయసులోనే ఊబకాయం మరియు అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. దీనికి తోడు, జంక్ ఫుడ్లు, కల్తీ ఆహారం మరియు నాణ్యతలేని రోజువారీ వినియోగ వస్తువుల వల్ల ఇటువంటి సమస్యల భారిన పడేవారు కోకొల్లలు ఉన్నారు.

చిన్న కుటుంబాలు మరియు ఇరుకు ప్రదేశాలతో, మనకి ఒళ్ళు కదిలే అవకాశం లేకుండా పోయింది. బార్మెచా కుటుంబం వారి శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఈ మూడు అంతస్తుల భవనంలో ప్రతి కొడుకుకు వేర్వేరు ఇళ్లతో వారు తమ కుటుంబ ఇంటిని నిర్మించుకున్నారు. తమను తాము చురుకుగా ఉంచుకోడానికి, బార్మెచాల భవనంలో ఎటువంటి ఎలివేటర్లను నిర్మించుకోలేదు. కాబట్టి వాళ్ళు కలవాలి అనుకున్న ప్రతిసారీ వారు మెట్లు ఎక్కడం లేదా దిగడం చెయ్యాల్సిందే.

మిస్టర్ బార్మెచా తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లడం ఇష్టపడతారు, శ్రీమతి బార్మెచా కూడా ఇంటి పనులను చేస్తూ మరియు రోజువారీ దేవాలయాలకు నడుచుకుంటూ వెళ్తూ తనను తాను చురుకుగా ఉంచుకుంటుంది.

చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా బార్మెచాస్ వారి జీవితాన్ని సరళంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోడానికి ఇష్టపడతారు.

ఆహారం మరియు ఉపవాసాలు

తప్పక ఆచరించే  ఆచారం లాగా, బార్మెచాల కుటుంబం ఎప్పుడూ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది మరియు ప్రోత్సహిస్తుంది. అలా కాకుండా, జైనమతంపై తమకున్న విశ్వాసం ప్రకారం ఆ మతం తినడం మరియు ఉపవాసం సంబందించిన  నిబంధనలను పక్కాగా పాటిస్తారు.

చిన్న కీటకాలు మరియు సూక్ష్మజీవులను గాయపరచకుండా ఉండటానికి మరియు మరియు మొక్క మొత్తం వేరుచేయబడి దాన్ని చంపడం నిరోధించడానికి బంగాళాదుంప, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి భూగర్భ కూరగాయలను మినహాయించే కఠినమైన జైన శాఖాహార ఆహారాన్ని ఈ కుటుంబం అనుసరిస్తుంది; . జైన మతం “అహింసా పార్మో ధర్మం” ను నమ్ముతుంది. అది ఎలాంటి హింసను అయినా సరే  ఖచ్చితంగా నిషేధిస్తుంది. పశువులపై పాడి పరిశ్రమ యొక్క దారుణాల కారణంగా చాలా మంది జైనులు శాకాహారం వైపు వెళ్ళడం గమనించవచ్చు.

ఆహారం మరియు జీర్ణక్రియను శాస్త్రీయంగా ప్రభావితం చేసే వంట మరియు తినే నిర్దిష్ట పద్ధతులను కూడా వీరు అనుసరిస్తారు. బార్మెచా కుటుంబంలోని విందులన్నీ సూర్యాస్తమయానికి ముందే తినేయాలి.

జైన మతం ఉపవాసం మరియు నిర్విషీకరణ యొక్క అవసరాన్ని కూడా ఎక్కువగా నొక్కి చెబుతుంది. పర్యుశాన్ యొక్క పవిత్ర పండగ ఒకటి  ఉంటుంది. ఆ మతం పట్ల వారికి ఉండే భక్తిని గురించి మరియు వారి సహనం మరియు సంపూర్ణ సంకల్ప శక్తిని ప్రదర్శించేందుకు దీనిని జరుపుకుంటారు. 

శ్రీమతి బార్మెచా మరియు ఆమె శతాబ్ది అత్తగారు గత చాలా సంవత్సరాల నుండి కఠినమైన ఉపవాసాలను పాటిస్తున్నారు. వారు ఇప్పటికీ “అయాంబిల్-ట్యాప్” పద్ధతిని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వారు 10 రోజులు ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వంటలోకి  ఉప్పు, మసాలాలు, నూనె మరియు నెయ్యి వాడకుండా ఉండాలి. వారు ఇతర ఉపవాస ఆచారాలను కూడా అనుసరిస్తారు. దీనిలో మీకు నీరు మాత్రమే త్రాగాలి మరియు ఒక వారం పాటు ఘనమైన ఆహారం తీసుకోకూడదు. రుచిని అధిగమించడం ద్వారా మరియు ఏదైనా కర్మ బంధాన్ని తొలగించడం ద్వారా ఆధ్యాత్మిక అభ్యున్నతి సాధించడం గమనించవచ్చు.

జైన సమాజం లో సాధారణమైన ఈ ఉపవాసాలన్నీ వారి సంకల్ప శక్తిని మరియు క్రమశిక్షణను ప్రదర్శించటానికే కాకుండా, శరీరం నుండి విషాన్ని బయటకు తీయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయని మిస్టర్ బార్మెచా అభిప్రాయపడ్డారు.

అభిరుచి అనుసరణ 

ఫిట్ గా ఉండటం అనేది మిస్టర్ అండ్ మిసెస్ బార్మెచాని వారి నిబంధనల ప్రకారం వారి జీవితాన్ని గడపే అవకాశాన్నిస్తుంది.

మిస్టర్ బార్మెచా, ఈ వయస్సులో కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు తన దుకాణాన్ని నిర్వహిస్తాడు. అతను ప్రతిరోజూ తన పనికి 5 కి.మీలు నడుస్తాడు, ఇది అతనికి ప్రత్యేక దినచర్యగా మారింది. అతను చాలా చురుకుగా ఉన్నాడని మరియు రోజుకు 5-6 సార్లు మెట్లు ఎక్కడం మరియు దిగడం గురించి ఎప్పుడూ సంకోచించరని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

శ్రీమతి బార్మెచ జైనంతో పాటు హిందూ మతానికి సంబంధించిన తీర్థయాత్రలకు కూడా వెళ్ళారు. అక్కడ, ఆమె రోజుకు 25 కి.మీ కంటే ఎక్కువ కాలినడకన నడిచేది. ఆమె గిర్నార్, పాలితానా, శిఖర్జీ వంటి ప్రదేశాలను సందర్శించింది. ఈ ప్రదేశాలలో కొన్ని చోట్ల 5000 కంటే ఎక్కువ మెట్లు ఉన్నాయి. ఆమె ఇప్పటికీ వాటిని సునాయాసంగా ఎక్కగలదు.

జీవితంలో చిన్న మరియు పెద్ద ప్రతిదాన్ని ఆస్వాదించాలనే అభిరుచి ఆమెను ఇంకా ముందుకు నడిపిస్తుంది. వాస్తవానికి, బార్మెచా కుటుంబం మొత్తం అభిరుచిని ప్రోత్సహిస్తుంది. అది వాళ్ళ పెద్ద అల్లుడు మరియు ఆమె కోడలు చేసే రుచికరమైన వంటలు కానీ లేదా చిన్న కొడుకు మరియు చిన్న కోడలు వృత్తిని పెద్దదిగా చేయాలనే అభిరుచిని కానీ లేదా కుటుంబం మొత్తాన్ని కలిఫై ఉంచాలనుకునే ఉద్దేశం లోనైనా కానీ వాళ్లెప్పుడూ చేయూతనిస్తారు.

 

సంతోషకరమైన స్నేహ సంబంధాలు

శ్రీమతి బార్మెచా ప్రతి సంవత్సరం తన స్నేహితులను సందర్శించడాన్ని మరియు వారితో నాణ్యమైన సమయాన్ని గడపడాన్ని ఇష్టపడుతుంది. ఆమె వారితో చాలా ప్రయాణాలు చేస్తుంది మరియు సంతోషకరమైన మనస్సు కోసం, మీ దగ్గరి సామాజిక వృత్తాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం అని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఈ రోజుకు కూడా ఆమె తన స్నేహితులతో  ఉన్నప్పుడు వారు చిన్నపిల్లలలా నవ్వుకుంటారని మిస్టర్ బార్మెచా చెప్పారు.

ఉమ్మడితనం  

శ్రీమతి బార్మెచాకి ఉన్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే ఆమె పెద్ద కుటుంబం ఎప్పుటికి విడిపోకుండా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండడమే. వారు తమ విలువలను వదులుకోకుండా వారి నమ్మకాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోడం గురించి చాలా గర్వపడతారు. వీళ్లది చిన్న ఇళ్లతో కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబం. వారి కుమారులు మరియు కుమార్తెలు బిజీగా పనిచేసే జీవనశైలిని కొనసాగిస్తారు, అయినప్పటికీ ఆరోగ్యకరమైన ఇంటి ఆహారాన్ని ఆస్వాదింస్తారు.

వారి కుటుంబమే వాళ్ల జీవితాన్ని మరింత ముందుకు నడిపించడానికి పరిపూర్ణత మరియు బలాన్ని ఇస్తుంది. వారు తమ కుటుంబం యొక్క ఐక్యత గురించి గర్వపడతారు మరియు ఆ ఐక్యత ఎప్పటికీ  అలాగే ఉండాలని వారు కోరుకుంటారు. వారు పాత-పాత పద్ధతులను వదిలివేయకుండా వాటిని తరువాతి తరాలకు అందించేలా చూస్తారు. వారి వారసత్వానికి విలువనిచ్చే మరియు సజీవంగా ఉంచే సంతోషకరమైన గృహాలలో ఉండే దీర్ఘాయువు గురించి మనకి మంచి పాఠాన్ని బోధిస్తుంది ఈ బార్మెచా కుటుంబం.

ఈ విధంగా వారి కుటుంబంలోని పెద్దావిడ లాగా 100 సంవత్సరాల క్లబ్‌లో చేరాలని ఈ కుటుంబం లక్ష్యంగా పెట్టుకుంది. వారి రోజువారీ జీవితంలోని వివేకం తెలుసుకోవాలని ఆరాటపడుతూ వెళ్లిన హ్యాపీఅజింగ్సరళత మనకు సుదీర్ఘ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా బహుమతిగా ఇస్తుందో మరియు వృద్ధాప్యాన్ని సంతోషకరమైనదిగా చేస్తుంది అనేది తెలుసుకోని బార్మెచాలనుండి బయలుదేరింది.

100 క్లబ్‌లో చేరేందుకు వారి జ్ఞాన సంపదని మనతో పంచుకున్నందుకు బార్మెచాస్ కుటుంబానికి హ్యాపీఅజింగ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. సుదీర్ఘ జీవితానికి రహస్యం ఏంటని మీరు అనుకుంటున్నారో దాన్ని క్రింద వ్యాఖ్యలలో పంచుకోండి.

Ask a question regarding వీక్షించండి: బార్మెచా కుటుంబం శతాబ్ది క్లబ్‌లో చేరడానికి ఎలా లక్ష్యంగా పెట్టుకుంది?

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here