2 MIN READ

వృద్ధులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కానీ మరియు ఇంట్లో క్రింద పడే అవకాశాలు కానీ ఎక్కువ. వయస్సు పెరిగేకొద్దీ మనం మన సమతుల్యత, ఎముక సాంద్రత మరియు కండరాల బలహీనతను కోల్పోతూ ఉంటాము. ఫలితంగా ప్రమాదాలకు గురయ్యే మరియు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఇతర వయస్సు వాళ్లకన్నా వృద్ధులు ఎక్కువ క్రింద పడిపోవడానికి గల కారణాలు, పరిస్థితులు  క్రింద ఇవ్వబడ్డాయి:

 • రక్తపోటు వంటి పరిస్థితులు వృద్దులకు మైకాన్ని కలుగ చేస్తాయి. అందువల్ల పడిపోయే అవకాశం కలదు. 
 • కంటి చూపు మందగించటం లేదా కండరాల బలహీనత కూడా క్రింద పడడానికి కారణం అవుతాయి
 • సమతుల్య సమస్యలకు కారణమయ్యే లేబ్రిన్థిటిస్ (చెవులలో మంట) వంటి సమస్యలు కూడా క్రింద పడటానికి కారణం అవుతాయి. 

మన ఇళ్లను వృద్ధులకు అనుగుణంగా మార్చాలని మరియు వాళ్ళు అటూ ఇటూ  తిరగడంలో ఇబ్బందిపడకుండా ఇంటిని తయారుచేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వృద్ధులు ఎదుర్కొనే కొన్ని ప్రమాదాలు మరి వాటిని నివారించే మార్గాలు క్రింద ఇవ్వబడ్డాయి:

క్రింద పడటం: వృద్ధులలో ఎక్కువ ప్రమాదాలు జరిగే విషయం క్రింద పడటం. వృద్ధులలో 75% గాయాలకు అదే కారణం. తప్పుగా ఉంచిన వస్తువులు, అసమాన అంతస్తులు మరియు ఉపరితలాలు, అస్థిర ఫర్నిచర్ మరియు సరైన లైటింగ్ లేకపోవడం మొదలైన వాటి వల్ల వాళ్ళు క్రింద పడుతుంటారు.

వృద్ధుల ఉండే ఇంటిని ఎలా సంరక్షించుకోవాలో, మరియు ప్రమాదాల్ని నివారించడం కోసం క్రింద కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి :-

 • మెట్ల మార్గాలు మరియు స్నానపు గదులలో గ్రాబ్ బార్లను(పట్టుకోవడానికి కడ్డీలను) ఏర్పాటు చేయడం ద్వారా మీరు వృద్ధులను క్రింద పడకుండా నిరోధించవచ్చు.
 • అలాగే, మీరు ఇంట్లో బట్ట రగ్గులు మరియు కాలి పట్టాలకు బదులు  రబ్బర్ వి వాడండి.
 • గదులలో మరియు బాత్రూమ్ లోని నేలను అన్ని వేళలా పొడిగా మరియు శుభ్రంగా ఉంచండి.
 • మెట్ల మార్గంలో మరియు బెడ్ రూములలో తగినంత కాంతి  ఉండేలా చూసుకోండి.
 • వంటగదిలో అవసరముండే అన్నింటినీ అందుబాటులో ఉంచండి. అప్పుడు మీరు వాటిని అందుకోవడానికి ఏది ఎక్కాల్సిన అవసరం ఉండదు.
 • మీ ఇంట్లోని వృద్ధులు జారకుండా ఉండే బూట్లు వేసుకునేలా చూడండి. 
 • జారకుండా ఉండే టైల్స్ వేయించుకోవడం కూడా ప్రయోజనకరమైనదే. 

మంటలు మరియు కాలిన గాయాలు: అగ్ని మరియు కాలిన గాయాలు ఎక్కువగా అసురక్షిత మరియు క్రమబద్ధీకరించని వేడిని -ఉత్పత్తి చేసే పరికరాల కారణంగా అవుతుంటాయి. చాలా మంది వృద్దులకు వంటగదిలో పనిచేసేటప్పుడు కాలిన గాయాలు అవుతుంటాయి.

వాటిని నిరోధించడం ఎలా?

వృద్ధాప్యం అంటే మీరు వేగాన్ని తగ్గించడం లేదా వంట చేయడం మానేయడం కాదు. కాలుడు గాయాలను నివారించడానికి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు.

 • పని అయిపోయిన తరువాత గ్యాస్ ను ఆఫ్ లో ఉండేట్లు చూసుకోండి.
 • ఉపయోగించడానికి సురక్షితంగా ఉండే వస్తువులనే కొనండి.
 • వంటగదిలో పొగ అలారంలను ఏర్పాటు చేయండి మరియు వంట చేసేటప్పుడు మీరు మరొకరి సహాయం తీసుకునేట్లు చూసుకోండి.
 • వేడి పాత్రలతో పని ఉన్నప్పుడు వస్త్రానికి బదులు మొత్తం దిగువ చేతిని కప్పి ఉంచే పొడవైన  చేతి తొడుగులను ఉపయోగించండి.

వెక్కిళ్లు మరియు ఆహార సంబంధిత ప్రమాదాలు: తినేటప్పుడు మాట్లాడటం లేదా నవ్వడం వల్ల వెక్కిళ్లు వచ్చే ప్రమాదం ఉంది. మీరు చిన్న చిన్న ముద్దలకు బదులుగా పెద్ద ముద్దల్లో ఆహారాన్ని తీసుకుంటే కూడా అలా జరుగుతుంది. వృద్ధులు లేబుల్స్ చదవకుండా గడువు ముగిసిన ఆహారాన్ని కొనుగోలు చేసిన లేదా పండ్లు మరియు కూరగాయలను సరిగ్గా ఉడికించకపోయినా కూడా వృద్ధులు ఫుడ్ పాయిజనింగ్ కి గురవుతారు.

దీనిని ఎలా నిరోధించాలి?

 • మింగడానికి సులభమైన మరియు సున్నితమైన నిర్మాణం కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోండి. వృద్ధులు, ముఖ్యంగా పళ్ళు పోగొట్టుకున్న వారు గట్టిగా ఉండే ఆహారాన్ని నమలడం కష్టంగా ఉంటుంది.
 • వృద్ధుల ఆహారం మెత్తగా మరియు నమలగలిగే విధంగా ఉండాలి. తద్వారా అది సులభంగా అరుగుతుంది. 
 • పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఫ్రిడ్జ్ యొక్క ఉష్ణోగ్రతను 40 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఉంచండి.

ఈ కొన్ని మార్పులతో, వృద్ధులు వారి భద్రతలో ప్రమాద రహిత జీవితాన్ని గడిపేలా చూడొచ్చు.

Ask a question regarding వృద్ధులలో ప్రమాదాలు మరియు వాటిని నివారించుకునే మార్గాలు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here