3 MIN READ

మీ భాగస్వామితో మంచి శృంగారాన్ని ఆస్వాదించడానికి వయోపరిమితి అంటూ ఏమీ
లేదు. మీరు వయస్సులో ఉన్న వారైనా కానీ వయస్సు పైబడ్డ వారైనా కానీ, మీరు మీ
భాగస్వామితో శృంగారం గురించి మాట్లాడటం ద్వారా మరియు దాని గురించి మీ
భాగస్వామికి ఉన్న అపోహలను దూరం చేయడం ద్వారా అందరూ సంతోషకరమైన లైంగిక
జీవితాన్ని అనుభవించవచ్చు.
చాలా మందికి వారి లైంగిక జీవితం పై చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా
వృద్ధాప్య వయస్సులో చాలా ఎక్కువగా ఉంటాయి. వయస్సుతో పాటుగా లైంగిక
ప్రవర్తన పై ప్రభావం చూపించే మార్పులు చాలా చోటుచేసుకుంటాయి. కొంతమంది
పురుషులలో శృంగార వాంఛ తగ్గిపోవటం లాంటివి అనుభూతి చెందగా, మహిళల్లో కూడా
కొన్ని శరీర మార్పులు మరియు లైంగిక వాంఛలో మార్పులు లాంటివి
చోటుచేసుకుంటాయి.
సాధారణంగా వృద్ధులకు లైంగిక జీవితం మరియు వృద్ధాప్యం గురించి ఎక్కువమందికి
సందేహం ఉండే 7 ప్రశ్నలు ఇక్కడ చర్చించబడ్డాయి:
Q1) నా లైంగిక జీవితం ఎలా మారబోతోంది?
స) వృద్ధాప్యంతో, స్త్రీ, పురుషులలో సహజమైన శారీరక మార్పులు వారి లైంగిక
జీవితంపై ప్రభావం చూపుతాయి. డయాబెటిస్ మరియు రక్తపోటు వంటి ఆరోగ్య
పరిస్థితులు మీ శృంగార వాంఛను మార్చడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
స్త్రీలలో అయితే మెనోపాజ్ అయిన తరువాత శృంగార వాంఛ తగ్గడం గమనించవచ్చు
తద్వారా యోని పొడిబారడం మరియు సంభోగం కాస్త నొప్పిని కలిగించవచ్చు. మీరు
హార్మోన్ల చికిత్సలో ఉన్నట్లయితే, మీలో అకస్మాత్తుగా శృంగార వాంఛ
పెరుగటం మీరు గమనించవచ్చు. మగవాళ్ళల్లో అయితే శృంగార వాంఛ తగ్గటం మరియు
అంగస్తంభన సమస్య కలుగవచ్చు.
Q2) 60 సంవత్సరాల తరువాత సంతోషకరమైన లైంగిక జీవితాన్ని ఎలా కొనసాగించగలను?
స) మీరు ఈ క్రింది వాటిని చేయడం ద్వారా సంతోషకరమైన లైంగిక జీవితాన్ని
కొనసాగించవచ్చు:
 మీరు మీ భాగస్వామితో మీ ఆలోచనల గురించి, కోరికల గురించి మరియు సెక్స్
గురించి మాట్లాడండి.
 శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండండి
 ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి
 క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
 ధూమపానం మరియు మద్యపానం మానేయండి. ఇది శృంగార వాంఛ పై ప్రత్యక్ష
ప్రభావాన్ని చూపుతుంది.
 క్రొత్తవాటిని ప్రయత్నించడానికి మొహమాట పడొద్దు.
 మీ భాగస్వామి సౌకర్యం మరియు మీ సౌకర్యం ప్రకారం దినచర్యను
సర్దుబాటు చేసుకోండి.

Q3) వయస్సు పై పడ్డాక లైంగిక పనితీరును ప్రభావితం చేసే అంశాలేవి?
స) పెద్దవారిలో లైంగిక జీవితాలను నిర్వహించడంలో శరీర ఆరోగ్యం గొప్ప పాత్ర
పోషిస్తుంది. వివిధ ఆరోగ్య పరిస్థితుల కోసం మందులు వాడటం వల్ల కోరిక తగ్గడం
లేదా అస్సలు కలగకపోవడం జరుగుతుంది. మగవారిలో ఎక్కువసేపు అంగస్తంభన ఉంచడం
కష్టమైపోతుంది. మరియు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అలాగే స్త్రీలలో
కూడా ఋతుస్రావం అయిపోయిన తరువాత హార్మోరున్లలో కలిగే మార్పుల వలన
మరియు యోని పొడిబారడం కారణంగా శృంగార వాంఛ తగ్గే అవకాశం ఉంది.

Q4) సురక్షితమైన శృంగారం గురించి ఆందోళన చెందే వయస్సును నేను దాటిపోయానా?
స) సురక్షితమైన శృంగారం అన్ని వయసులలోను తగు జాగ్రత్త వహించాలి. అన్ని
వయసులలో సురక్షితంగా లైంగిక సంబంధం కలిగి ఉండటం అనేది జాగ్రత్త వహించడం
లాంటిది. అది మీ భాగస్వామికి మాత్రమే కాదు, మీకు కూడా మంచిది. ఎయిడ్స్,
సిఫిలిస్, గోనేరియా వంటి ప్రాణాంతక లైంగిక సంక్రమణ వ్యాధులు అసురక్షిత
లైంగిక చర్యల ద్వారా సంక్రమింస్తాయి. సురక్షితమైన శృంగారం కొరకు ఈ
క్రిందివి పాటించండి:
 కండోమ్‌లను వాడండి (మగ & ఆడ)
 కొత్త భాగస్వాములతో సురక్షితమైన శృంగారం గురించి చర్చించండి
 ఓరల్ సెక్స్(నోటి ద్వారా లైంగిక కార్యకలాపాలు) చేసేప్పుడు కోసం
డెంటల్ డామ్స్ ను వాడండి
 ఘర్షణతో కండోమ్ దెబ్బతినకుండా ఉండటానికి నీరు లేదా సిలికాన్ ఆధారిత
కందెనలు వాడండి
 మద్యం ఎక్కువ సేవించి శృంగారం చేయకండి.
 శృంగారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను (STD's)
నిర్దారించుకోవటానికి పాప్ పరీక్షలు, కటి పరీక్షలు మరియు ఆవర్తన
పరీక్షలు చేయించుకోండి.
 సురక్షితమైన సెక్స్ గురించి చదవండి మరియు మీ భాగస్వామికి కూడా అవగాహన
కల్పించండి.
Q5) వృద్ధాప్య దంపతులకు సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
స) లైంగిక ఆనందం యువ జంటలకు మాత్రమే కాదు వృద్దులకు కూడా అనేక విధాలుగా
లాభాలను చేకూరుస్తుంది. శృంగారం వల్ల వృద్దులకు కలిగే లాభాలు:
• శృంగారం మెదడును ఉత్తేజపరిచేందుకు మరియు చురుకుగా ఉండటానికి సహాయపడే
హార్మోన్లను విడుదల చేస్తుంది.
• శృంగారం జంటలను సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
• శృంగారం చేయడం వల్లన ఆందోళన మరియు నిరాశను తగ్గుతుంది.

• శృంగారం జంటల మధ్య భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో
సహాయపడుతుంది.
• శృంగారం ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది.
• శృంగారం రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా
రక్తం బాగా ప్రవహిస్తుంది మరియు గుండెపోటు, రక్తపోటు మొదలైన ప్రమాద
అవకాశాలు తగ్గుతాయి.
• శృంగారం ఉత్తేజం పెరిగేందుకు సహాయపడుతుంది.

Q6) నేను ఈ వయస్సులో కూడా ఫోర్‌ప్లేలో పాల్గొనవచ్చా?
జ. లైంగిక చర్యలో ఫోర్‌ప్లే చాలా అవసరం. ఇది మీకు మరియు మీ భాగస్వామికి
ఒకరికి ఒకరు దగ్గరవడానికి మరియు ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలగడానికి
సహాయపడుతుంది. ఇది ఇద్దరి మానసిక స్థితిని నెలకొల్పడానికి మరియు శృంగార
జ్వాలను ఎక్కువసేపు సజీవంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, తక్కువ సరళత
సమస్య ఉన్న వృద్ధ మహిళలలో, ఫోర్‌ప్లే సహజ సరళతను ఉత్పత్తి చేయడంలో
సహాయపడుతుంది. అంతేకాకుండా ఫోర్ ప్లే జంట వారి ప్రత్యేక సమయాన్ని
మెరుగైన రీతిలో ఆస్వాదించడానికి సహాయపడుతుంది. కాబట్టి, శ్వాస సమస్య,
గ్లూకోజ్ స్థాయిలు తగ్గటం మరియు అలసట లాంటి ఇబ్బందులు ఉన్నవాళ్లు తక్కువ
సమయంలోనే మధురమైన ఫోర్ ప్లే ను చేసుకోవచ్చు.

Q7) శృంగారం గురించి చర్చించడానికి వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉందా?
స) మీరు మీ లైంగిక జీవితంలో సంతృప్తి చెందకపోతే సెక్సాలజిస్ట్ సహాయం
తీసుకోవచ్చు. వృద్ధులలో సాధారణంగా మహిళల విషయంలో తక్కువ శృంగార వాంఛ లేదా
యోని పొడిబారడం లాంటి సమస్యలు ఉంటాయి మరియు పురుషుల విషయంలో అంగస్తంభన
గురించిన ఫిర్యాదులు ఉంటాయి. ఈ సమస్యలను సరైన మందుల ద్వారా
పరిష్కరించుకోవచ్చు. ఈ సమస్యలని మీ వైద్యుడితో చర్చించుకుంటే సరిపోతుంది.
ఆరోగ్యకరమైన మరియు సంతృప్తికరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలగడం మీ
హక్కు మరియు వైద్యుడితో దాని గురించి మాట్లాడేటప్పుడు ఎటువంటి సంకోచం
ఉండకూడదు. అవసరమైనప్పుడు సలహా తీసుకోండి మరియు మీ జీవితాన్ని
పూర్తిస్థాయిలో ఆస్వాదించండి.

వీటితో పాటు మీకు ఏవైనా ఇతర ప్రశ్నలు ఉన్నట్లయితే క్రింద కామెంట్
చేయగలరు. మేము వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాము.

Ask a question regarding సెక్స్ లైఫ్ మరియు వృద్ధాప్యం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here