2 MIN READ

అత్యవసర సహాయాలకొరకు పిలుపునిస్తుంది

ఈ హెచ్చరిక పరికరాలన్నీ కూడా చాలా వరకు మీ అత్యవసర సంప్రదింపు
వ్యక్తిని లేదా అంబులెన్స్, వైద్యుడు లేదా అగ్నిమాపక విభాగం వంటి
అత్యవసర సేవలను అప్రమత్తం చేసే పుష్ బటన్‌ను కలిగి ఉంటాయి. మీరు
మాట్లాడే లేదా సహాయం కోసం పిలుపు నిచ్చే స్థితిలో లేనప్పటికీ ఇది మీకు
సహాయపడుతుంది. ఏదైనా ఊహించని వైద్య సంక్షోభం విషయంలో ఇది మీకు
సహాయపడే గొప్ప లక్షణం..

జిపిఎస్ గుర్తింపు

మీరెక్కడ ఉన్నారన్నది తెలియకపోతే మీకు కావాల్సిన వ్యక్తికి అత్యవసర
సందేశాన్ని పంపడం వల్ల లాభం ఉండదు. మీ స్థానం గురించి వారిని అప్రమత్తం
చేయడానికి మీకు ఏదో ఒక మార్గం ఉండాలి. మీ హెచ్చరిక పరికరం మీ కోసం ఆ పని
చేసిపెడుతుంది. ఇది మీ ఖచ్చితమైన స్థానాన్ని పంపగలదు, తద్వారా మీకు తక్షణ
వైద్య సహాయం లభిస్తుంది.

ఫిట్‌నెస్ ట్రాకర్

మీ ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించాల్సిన రక్తపోటు, గుండె దడ, చక్కెర
స్థాయిలు లేదా ఊబకాయం వంటి వైద్య పరిస్థితి మీకు ఉంటే, మీ హైటెక్
మెడికల్ అలర్ట్ పరికరం మీ కోసం ఆ పని చేసి పెట్టగలదు. ఇది మీ హృదయ
స్పందన రేటును, చక్కెర స్థాయిలను, రోజువారీ నడిచిన అడుగుల లెక్కింపు,
రోజూ తీసుకునే కేలరీలు మరియు మీ రక్తపోటును మీకు తెలియచేస్తూ ఉంటుంది.
ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితుల్లో మీకు ముందస్తు హెచ్చరిక
ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది.

టూ-వే కమ్యూనికేషన్

దీని ద్వారా, ఒక్క బటన్ తో మీరు మీ ప్రియమైనవారితో మాట్లాడవచ్చు
మరియు మీరు అనుభవించిన ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం
గురించి వారిని హెచ్చరించవచ్చు. ఇది హ్యాండ్స్ ఫ్రీ కాబట్టి, మీరు మీ
స్థానం నుండి కదలలేక పోయినప్పటికీ మీరు మాట్లాడగలరు. మీరు మీ అత్యవసర
పరిస్థితిని కూడా వివరించవచ్చు మరియు అత్యవసర సమయాల్లో ఆలస్యం
అవ్వకుండా సంబంధిత సహాయం పొందవచ్చు.

ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించండి

మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి మీ అనారోగ్యాలు లేదా ఆరోగ్య పరిస్థితి
మీకు అడ్డు కాకూడదు. మీరు వెళ్ళిన ప్రతిచోటా అటువంటి హై-అలర్ట్ మెడికల్
గాడ్జెట్‌లను కలిగి ఉండటం ద్వారా, మీరు మీ జీవితాన్ని స్వతంత్రంగా
జీవించవచ్చు మరియు అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్ ప్రణాళికను కూడా
కలిగి ఉంటారు. ఇది మీ ప్రియమైనవారికి మీ ఆచూకీ తెలిసేలా మరియు మీకు
అవసరమైనప్పుడు అత్యవసర సహాయంతో మిమ్మల్ని చేరుకునేలా ఇది
సహాయపడుతుంది.

Ask a question regarding హైటెక్ మెడికల్ అలర్ట్ పరికరాలు మనకు మనశ్శాంతిని ఎలా కలుగచేస్తాయి

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here