4 MIN READ

గత నలభైఏళ్లుగా అనేక సినిమాల్లో మరియు ధారావాహికల్లో నటించిన నటి సురేఖ సిక్రి గారు
ప్రముఖ ధారావాహిక "చిన్నారి పెళ్లికూతురు" లో బామ్మ పాత్ర ద్వారా మనందరికి చాలా
సుపరిచితురాలైపోయింది. 1978 లో వచ్చిన 'కిస్సా కుర్సీ కా' అనే నేపధ్యమున్న సినిమాతో
తన నటన వృత్తిని ప్రభించిన సురేఖ సిక్రి గారు ధారావాహికల్లో పోషించిన కొన్ని
శక్తివంతమైన పాత్రలకు గాను రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది.
మరియు ఇప్పుడు త్వరలో విడుదల కాబోయే ఆయుష్మాన్ ఖురానా, సన్యా మల్హోత్రా
మరియు నీనా గుప్తా నటించిన హాస్యభరిత చిత్రం 'బాధాయి హో' లో తన గమ్మతైన
డైలాగ్‌లతో ఆసక్తి రేకెత్తిస్తోంది..

గత నలభైఏళ్లుగా అనేక సినిమాల్లో మరియు ధారావాహికల్లో నటించిన నటి సురేఖ సిక్రి గారు
ప్రముఖ ధారావాహిక "చిన్నారి పెళ్లికూతురు" లో బామ్మ పాత్ర ద్వారా మనందరికి చాలా
సుపరిచితురాలైపోయింది. 1978 లో వచ్చిన 'కిస్సా కుర్సీ కా' అనే నేపధ్యమున్న సినిమాతో
తన నటన వృత్తిని ప్రభించిన సురేఖ సిక్రి గారు ధారావాహికల్లో పోషించిన కొన్ని
శక్తివంతమైన పాత్రలకు గాను రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది.
మరియు ఇప్పుడు త్వరలో విడుదల కాబోయే ఆయుష్మాన్ ఖురానా, సన్యా మల్హోత్రా
మరియు నీనా గుప్తా నటించిన హాస్యభరిత చిత్రం 'బాధాయి హో' లో తన గమ్మతైన
డైలాగ్‌లతో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇవ్వాళ పరిస్థితి మారింది. జనాలు కూడా కాస్త అర్ధంచేసుకునే స్థితిలో ఉన్నారు.
‘వృద్ధులు లైంగికంగా చురుకుగా ఉండటం' పాత వంటి అంశాలను మనం అర్ధం చేసుకుని మరియు
ఆమోదయోగ్యమైనవిగా పరిగణించే స్థితికి మన ఆలోచనలు అభివృద్ధి చెందాయి. ప్రజలు ఈ
చిత్ర కథని ఇష్టపడతారని మరియు ఇలాంటి అంశాల పై మరింత పరిణితి చెందుతారని నేను
కచ్చితంగా భావిస్తున్నాను.
మీరు 1970ల నుండి చాలా చురుకుగా ఉంటూ పని చేస్తున్నారు. కాలక్రమేణా ఒత్తిడి స్థాయిలు

మారుతున్నట్లు మీరు ఏమైనా గమనించారా?

ఒత్తిడి స్థాయిలు ఖచ్చితంగా పెరిగాయి. రోజువారీ జీవనం కష్టమైంది. ప్రతి విషయంలో
అనిశ్చితి ఉంది. ”

జనాలు లేవగానే ఉద్యోగానికి పరుగులుతీయడం మరియు సాయంకాలానికి ఇళ్లకు
పరుగులు తీయడం ఈ రెండు పరుగుల మధ్య చాలా అసౌకర్యానికి ఇబ్బందులకు గురవుతారు. జీవితం
చాలా ఒత్తిడిగా తయారైంది. కానీ, మానవులు స్థితిస్థాపకంగా ఉంటారు కాబట్టి వారు
ఒత్తిడిని సర్దుబాటు చేయడానికి ఏవో ఒక మార్గాలని కనుగొని వీలైనంత వరకు తిరిగి
కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
పాత కాలంలో విషయాలు మరింత మనోహరంగా మరియు సులభంగా ఉండేవి. పనులు నెమ్మదిగా
జరిగేవి. అప్పట్లో మేము ఫోన్ కాల్ చేయడానికి కూడా వేచి ఉండాల్సి వచ్చేది, ఆ
రోజుల్లో మాకు ట్రంక్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రతిదీ వేళ్ళమీద ఉంది మరియు చాలా
వేగంగా కదులుతోంది. అందుకే మనం అప్పుడప్పుడు అన్నింటినుంచి కాస్త విరామం తీసుకొని
జీవితాన్ని మరియు మన ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి.
ప్రజలు వారి ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరని మీరు అనుకుంటున్నారా? ఎందుకలా
అనుకుంటున్నారు?

ఆహారం కూడా పాఠశాల పాఠ్యాంశాల్లో ఒక భాగంగా ఉండాలి
అవును,30 మరియు 40 ఏళ్ళ వయస్సు వాళ్ళు కూడా చాలా ఆరోగ్య సమస్యలను
ఎదుర్కొంటున్నారు.

ప్రజలు అన్ని రకాల అనారోగ్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఏది
తినాలో, ఏది తినకూడదో వారికి అర్థం కావడం లేదు.

ఆహారం కూడా పాఠశాల పాఠ్యాంశాల్లో
ఒక భాగంగా చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను నమ్ముతున్నాను.

ఏఆహారంలో పోషకాహారం ఉందో, ఆ ఆహరం తో ఫిట్‌నెస్‌ను ఎలా సమతుల్యం చేసుకోవాలో
ప్రజలు తెలుసుకోవాలి. ఇది ప్రాథమిక పాఠ్యాంశాల్లో ఒక భాగంగా ఉండాలి. తప్పుడు ఆహారం
వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను జనాలు అర్థం చేసుకోవాలి.
మీరు గత నాలుగు దశాబ్దాలుగా పని చేస్తున్నారు, మీరు మీ వృత్తి జీవితాన్ని మరియు మీ
వ్యక్తిగత జీవితాన్ని ఎలా నిర్వహిస్తారు?

నా పనిని నేను అమితంగా ప్రేమిస్తాను. కనుక అది నాకు మరింత పనిచేసే శక్తిని ఇస్తుంది.”
నేను నా పనిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అంత బాగా పనిచేయగలుగుతాను. నేను
ఖచ్చితంగా అమితంగా ప్రేమిస్తాను మరియు అది నాకు మరింత పనిచేసే శక్తిని ఇస్తుంది.
నటన నాకు మేధోపరంగా, శారీరకంగా మరియు మానసికంగా ఆసక్తి కలిగిస్తుంది. ఇది నన్ను
ఆకర్షిస్తుంది. నేను ఒక పాత్రను పోషించినప్పుడు, ఆ పాత్ర ఎక్కడ నుండి వచ్చింది, ఆ
పాత్ర యొక్క అంతర్గత ఆలోచనలు ఏమిటి, ఆ పాత్ర యొక్క మనస్తత్వశాస్త్రం ఏమిటి
లాంటి మొదలైన వాటి గురించి నేను ఆలోచిస్తాను మరియు నేను ఎక్కడికి వెళ్ళినా నా
చుట్టూ ఉండే వాళ్ళందరిని గమనిస్తాను. కాబట్టి, చురుకుగా ఉండటం మరియు పనిచేయడం నాకు
సంతోషాన్ని కలిగిస్తాయి.

ఈ వయస్సులో కూడా ఇంత ఫిట్ గా ఉండటానికి మీరు ఏమైనా ఆరోగ్య సూత్రాలను
పాటిస్తారా?
చికిత్స మరియు దీర్ఘకాలిక ప్రభావం కోసం నేను యోగా మరియు ఆయుర్వేదాన్ని
నమ్ముతాను.
ఫిట్ ఉండాలి అనే భావన ముఖ్యంగా వృద్దులలోకి వచ్చేసరికి ఎందుకు తగ్గిపోతుంది?

పదవీ విరమణ అనేది వాన్-ప్రాష్ ఆశ్రమం యొక్క భావనల నుండి వచ్చిన పాత-కాలపు
మనస్తత్వం.
ఇది వాన్-ప్రస్థా ఆశ్రమం నుంచి వచ్చిన వచ్చిన పాత-కాలపు మనస్తత్వం అని నేను
అనుకుంటున్నాను.

పదవీ విరమణ కానివ్వండి, ఆరోగ్యం ఆసక్తి తగ్గడం మరియు అలాంటి అన్ని
భావనలు కూడా అలా వచ్చినవే అనుకుంటాను. పదవీ విరమణ అనే పదానికి ఇక వాళ్ళెందుకు పనికిరారు
అనే భావం జోడించబడింది. ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాలి? మీరు మీ జీవితమంతా పని
చేస్తున్నారు. మీరు మీ మెదడును ఉపయోగిస్తున్నారు. మీరు రోజు ఉద్యోగం చేస్తుంటే
అది ఒక అలవాటుగా అయిపోతుంది. ఆ ఉద్యోగాన్ని మానేసిన తర్వాత, ఆ అలవాటు సతమవుతుంది
మరియు అది నిరాశకు దారితీస్తుంది.
అయితే, పదవీ విరమణ తర్వాత ప్రజలు తమను తాము ఎలా బిజీగా ఉంచుకోవాలి అంటారు?
“మీరు ఏమి చేస్తున్నారనే దానిపై ఆసక్తి కలిగి ఉండండి. మిమ్మల్ని మీరు బిజీగా
ఉంచుకోడానికి మరియు పదవీ విరమణ తర్వాత ఏదో కోల్పోయినట్లు అనిపించకుండ వేల పనులు

చేయవచ్చు.”

చేస్తున్న పని పై ఆసక్తి కలిగి ఉంటే సరిపోతుంది. ఒక అలవాటు పోయిందని అర్థం
చేసుకోవలసిన సమయం ఇది, ఇప్పుడు మనం బిజీగా ఉండటానికి క్రొత్త వాటిని వెతుక్కోవాలి.
మీరు తోటపని చేయవచ్చు లేదా పుస్తకాలు చదవవచ్చు, వ్యాసాలు రాయవచ్చు లేదా ఎన్జీఓల

ద్వారా ప్రజలకు సహాయపడవచ్చు.

వృద్ధులు ఇంకా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలి, కంప్యూటర్లు మరియు మొబైల్‌లను
ఉపయోగించడం నేర్చుకోవాలి.
మనం అనుకుంటే కొన్ని వేల పనులు చేయవచ్చు. కొంతమంది ఆర్థిక పరిస్థితుల కారణంగా
మరియు తమ పిల్లలను పెంచడానికి జీవితమంతా కష్టపడిన తరువాత వారి ప్రయత్నాన్ని
చాలిస్తుంటారు; మధ్యతరగతి వాళ్ళకి జీవితం అలాంటి పోరాటం. కాబట్టి వారు పదవీ విరమణ
తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడతారు. అది కూడా మంచిదే. కానీ ఏదో
చేయలేకపోయామన్న చింత మాత్రం ఉండకూడదు.
మన దేశంలోని వృద్ధుల ఆరోగ్య సంరక్షణ పరిస్థితి ఎలా మారుతుందని మీరు
అనుకుంటున్నారు?

ఆరోగ్యమైన జీవనం గురించి వయస్సుతో సంబంధం లేకుండా అందరికి మరింత అవగాహన
కల్పించాలి. జనాలు కూడా వారి ఆరోగ్యం పట్ల వారికి ఉన్న కఠినమైన వైఖరిని
మార్చుకోవాలి. ఆహార పదార్ధాల విషయం లో పురుగుమందుల వాడకాన్ని ప్రభుత్వం
నియంత్రించాలి. సేంద్రీయ వ్యవసాయాన్ని మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని
ప్రభుత్వం సమర్ధించాలి.
మన దేశ నవ యువతకి మీరేదయినా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?

మంచి ఆరోగ్యం సంతోషకరమైన మనస్సుకు దారితీస్తుంది!

దయచేసి శుభ్రమైన ఆహారాన్ని తినండి మరియు ఎల్లప్పుడూ నిజం చెప్పండి. ఇవి
మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచే రెండు విషయాలు. మరియు ఎప్పుడూ ఒకటి
గుర్తుంచుకోండి – మంచి ఆరోగ్యం సంతోషకరమైన మనస్సుకు దారితీస్తుంది.

Ask a question regarding హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) అనేది శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలను నాశనం చేసే వైరస్. సరైన మందులతో, హెచ్‌ఐవి ని ఎయిడ్స్‌ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) గా అభివృద్ధి చెందకుండా అలాగే ఆపగలిగే అవకాశం ఉంది. హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలెంటో వాటి అస్సలు వాస్తవాలేంటో తెలుసుకోవడానికి దీనిని చదవండి. 1వ అపోహ అపోహ: హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల హెచ్‌ఐవి ఇతరులకి సోకుతుంది. వాస్తవం: హెచ్‌ఐవి గాలి ద్వారా సంక్రమించే వ్యాధి కాదు. అదే గాలిని పీల్చడం ద్వారా లేదా ఒకే చోట ఉండటం వల్ల కానీ హెచ్ ఐ వి సోకదు. 2 వ అపోహ అపోహ: కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది. వాస్తవం: ఇది సుద్ద తప్పు. అలా గైతే మనం హెచ్ఐవి పాజిటివ్ మరియు హెచ్ఐవి నెగిటివ్ వ్యక్తుల కోసం రెండు ప్రత్యేక ప్రపంచాలను సృష్టించాలి. మీరు నిశ్చింతగా హెచ్ఐవి ఉన్నవారిని కౌగిలించుకోవచ్చు మరియు ముద్దు పెట్టుకోవచ్చు. వీర్యం మరియు రక్తం వంటి శరీర ద్రవాలను పంచుకోవడం ద్వారా మాత్రమే HIV వ్యాపిస్తుంది. 3వ అపోహ అపోహ: దోమ కాటు ద్వారా హెచ్‌ఐవి వ్యాపిస్తుంది వాస్తవం: దోమలు రక్తాన్ని పీల్చుకుంటాయి తప్పా, రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయవు. అలా చేస్తూ పోతే అవ్వి ఎలా బ్రతుకుతాయి? దోమల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందదు. 4వ అపోహ అపోహ: హెచ్ఐవి సోకిన వారు కొంతకాలమే జీవిస్తారు వాస్తవం: సైన్స్ మరియు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. సరైన మందులు మరియు సకాల చెక్ అప్లతో, ఒకరు హెచ్‌ఐవితో సుదీర్ఘ జీవితాన్ని గడపగలరని మరియు హెచ్ఐవి ని ఎయిడ్స్‌కు అభివృద్ధి చేయకుండా నిరోధించవచ్చని తెలుసుకోండి. 5వ అపోహ అపోహ: భాగస్వాములిద్దరికీ హెచ్‌ఐవి ఉన్నప్పుడు సెక్స్ సురక్షితం వాస్తవం: రక్షణ లేకుండా సెక్స్ ఎప్పుడూ సురక్షితం కాదు. మీకు అవాంఛిత గర్భధారణ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్‌ఐవి పాజిటివ్ రోగుల విషయంలో, వారు ఒకరికొకరు ఇతర హెచ్‌ఐవి జాతులను మరియు లైంగిక సంక్రమణ వ్యాధులను వ్యాప్తి చేసుకునే అవకాశం ఉంది. ఇవి హెచ్‌ఐవి వ్యతిరేక మందులకు నిరోధకతను కలిగి ఉంటాయి. 6వ అపోహ అపోహ: మీకు హెచ్‌ఐవి ఉంటే మీరు పిల్లలను కనకూడదు వాస్తవం: తల్లి నుంచి తన పుట్టబోయే బిడ్డకు, హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌ సోకే అవకాశం ఉన్నప్పటికీ, సరైన మందులు వాడటం ద్వారా హెచ్‌ఐవి నెగటివ్ బిడ్డకు జన్మని ఇవ్వొచ్చు. సైన్స్ అభివృద్ధి చెందింది, హెచ్ఐవి పాజిటివ్ మహిళలకు హెచ్ఐవి నెగిటివ్ పిల్లల్ని కనే అవకాశాన్ని మరియు అలాంటివారికి కుటుంబ జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇస్తుంది.

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here