3 MIN READ

2024 నాటికి ఎయిడ్స్‌ రహితంగా ఉండాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది
1986 లో భారతదేశంలో మొట్టమొదటిసారి హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్
డయాగ్నసిస్ వచ్చిన తరువాత 2024 నాటికి ఎయిడ్స్‌ రహిత దేశంగా ఉండాలని భారత్‌
లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హెచ్ఐవి వైరస్ అంటువ్యాధి లాగా దేశం అంతా
వ్యాపించింది, కొద్ది కాలంలోనే 5.2 మిలియన్ ఇన్ఫెక్షన్లు కనుగొనబడ్డాయి.
1986 లో సెల్లప్పన్ నిర్మల యొక్క మార్గదర్శక పరిశోధన ద్వారా భారతదేశంలో
హెచ్ఐవి ప్రవేశించిందని కనుగొన్నారు.

1986 నుండి, భారతదేశం హెచ్ఐవి యొక్క పరిశోధనలో మరియు హెచ్ఐవి ఎయిడ్స్ తో
పోరాటంలో చాలా పట్టు సాధించింది.
హెచ్ఐవి అంటే ఏమిటి మరియు ఎయిడ్స్ అంటే ఏమిటి?

 

గణాంకాలు ఏమి సూచిస్తున్నాయి?
యూఎన్ ఎయిడ్స్(UNAIDS) డేటా ప్రకారం, 2017, భారతదేశంలో హెచ్ఐవి
ఇన్ఫెక్షన్లు 46% వరకు తగ్గాయి. అయినప్పటికీ, ప్రపంచ పటంలో హెచ్ఐవి
సంక్రమణ పరంగా 2.1 మిలియన్ పాజిటివ్లతో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.

ఈ ఎయిడ్స్ బారిన పడ్డ వారిలో 9.9% మంది ఇంజెక్ట్ చేసిన మందుల ద్వారా, 7.2%
మంది ట్రాన్స్‌జెండర్ల ద్వారా, 4.3% స్వలింగ సంపర్కుల వల్ల మరియు
మిగితాదంతా పురుషులతో శృంగారం చేసే పురుషుల ద్వారా మరియు 2.2% సెక్స్
హెచ్ఐవి (HIV)
హెచ్ఐవి- హ్యూమన్
ఇమ్మ్యూనో డెఫిసియెన్సీ
వైరస్ (human immune deficiency virus)
అనేది సంక్రమణకు కారణమయ్యే
వైరస్
ఇది రోగనిరోధక కణాలను (సిడి 4
కణాలు) చంపడం ద్వారా వ్యవస్థను
దెబ్బతీస్తుంది, ఇది సోకే
వ్యాధులతో పోరాడనివ్వకుండా
శరీరాన్ని బలహీనపరుస్తుంది.

ఎయిడ్స్ (AIDS)
ఎయిడ్స్- ఆటో ఇమ్యూన్
డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది
హెచ్ఐవి సంక్రమణ యొక్క చివరి
దశ.
శరీరంలో హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్
పెరిగేకొద్దీ, ఇది సిడి 4 కణాలను
చంపుతూనే ఉంటుంది, దీనివల్ల శరీరం
యొక్క రోగనిరోధక వ్యవస్థ
పోరాడలేదు.

హెచ్‌ఐవి మందులు
ఎయిడ్స్‌ గా
మారబోయే
ఇన్‌ఫెక్షన్‌ను
నివారించడంలో
సహాయపడతాయి.

వర్కర్లతో ఉండే లైంగిక సంబంధాల వల్ల సంక్రమణం చెందారని నివేదిక
సూచిస్తుంది.
కానీ, 2000 నుండి 2015 వరకు మన దేశంలోని కొత్త కేసులలో 66% గణనీయంగా
పడిపోయాయి అనే వార్త కాస్త ఉపశమనం కలిగించే విషయం.
2024 నాటికి భారతదేశాన్ని ఎయిడ్స్‌ రహిత దేశంగా తీర్చిదిద్దే కొన్ని
ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, దేశంలో ఎయిడ్స్ బాధితుల సంఖ్యలు పెరిగే అవకాశం
ఇంకా ఉంది.
హెచ్ఐవి -ఎయిడ్స్ తో పోరాడటానికి భారతదేశం ఏమి చేస్తుందో తెలుసుకుందాం:
2017 లో, హెచ్ఐవి సోకిన వారి సంఖ్యను తగ్గించడంకోసం భారతదేశం రెండు
ప్రకటనలు చేసింది:
హెచ్ఐవి / ఎయిడ్స్ బిల్లు చట్టం: హెచ్ఐవి బారిన పడ్డ మరియు ప్రభావితమైన
ప్రజల హక్కులను పరిరక్షించడంలో ఈ బిల్లు సహాయపడుతుంది.
టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ: ఈ విధానం ప్రకారం హెచ్‌ఐవితో నివసించే
వారందరికీ సిడి 4 కౌంట్, క్లినికల్ స్టేజ్, వయస్సు లేదా జనాభాతో సంబంధం
లేకుండా యాంటీరెట్రో వైరల్ థెరపీతో చికిత్స చేయాలి.
అలాగే, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌, ఎస్‌టిఐ 2017 – 2024 జాతీయ వ్యూహాత్మక
ప్రణాళిక(National strategic plan) ప్రకారం, ఈ క్రింద పేర్కొన్న తక్షణ లక్ష్యాలను
2020 నాటికి చేధించాలి:
 కొత్త హెచ్‌ఐవి కేసులను 75% వరకు తగ్గించటం
 90-90-90: హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్నవారిలో 90% మందికి వాళ్ల పరిస్థితులు
తెలుస్తాయి, వారి పరిస్థితి తెలిసిన వారిలో 90% మంది చికిత్స పొందుతూ
ఉంటారు మరియు చికిత్స పొందుతున్న వారిలో 90% మంది వైరల్ లోడ్
అణచివేతను సమర్థవంతంగా గమనిస్తారు.
 ఒక్క బిడ్డకు కూడా తల్లి నుంచి ఈ వ్యాధి వ్యాపించకుండా చూసుకోవడం.
 కళంకం మరియు వివక్షను తగ్గించడం

మరియు 2024 ప్రణాళిక లక్ష్యాలు ఏవంటే :
 కొత్త హెచ్‌ఐవి కేసుల్లో 80% తగ్గింపు
 హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్నవారిలో 95% మందికి వారి పరిస్థితి తెలుస్తుంది,
వారి పరిస్థితి తెలిసిన వారిలో 95% మంది చికిత్సలో ఉంటారు మరియు
చికిత్స పొందుతున్న వారిలో 95% మంది సమర్థవంతమైన వైరల్ లోడ్
అణచివేతను గమనిస్తారు

ఇప్పటివరకు వచ్చిన పురోగతి ఏమిటి?

2024 నాటికి హెచ్‌ఐవి ఎయిడ్స్‌ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రణాళికలు
మరియు అమలులు జరుగుతుండగా, హెచ్‌ఐవి సంరక్షణ కోసం మరింత మెరుగైన ప్రణాళికలు
మరియు ఇంకా మంచి సౌకర్యాలు వస్తాయనే ఆశ ఉంది.
మనం ఏం చేయగలం అంటే:
ఈ వ్యాధి పట్ల అవసరమైన మేర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భారతదేశంలో,
శృంగారం గురించి మాట్లాడటమే నిషిద్ధంగా పరిగణించబడుతున్నప్పుడు, యువతకు
మాత్రమే కాకుండా, వృద్ధులకు కూడా సురక్షితమైన శృంగారం మరియు సమస్యల
గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

సురక్షితమైన శృంగారం అంటే ఏమిటి?
సురక్షితమైన శృంగారం మీకు మరియు మీ భాగస్వామికి ఎయిడ్స్, సిఫిలిస్, గోనేరియా
వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు సోకకుండా సహాయపడుతుంది.
సురక్షితమైన శృంగారం కోసం 7 మార్గాలు:

 కండోమ్‌లను వాడండి (మగ & ఆడ).
 కొత్త భాగస్వాములతో సురక్షితమైన శృంగారం గురించి చర్చించండి.
 ఓరల్ సెక్స్(నోటి ద్వారా లైంగిక కార్యకలాపాలు) చేసేప్పుడు కోసం
డెంటల్ డామ్స్ ను వాడండి.
 ఘర్షణతో కండోమ్ దెబ్బతినకుండా ఉండటానికి నీరు లేదా సిలికాన్ ఆధారిత
కందెనలు వాడండి.
 మద్యం ఎక్కువ సేవించి శృంగారం చేయకండి.
 శృంగారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను (STD's)
నిర్దారించుకోవటానికి పాప్ పరీక్షలు, కటి పరీక్షలు మరియు ఆవర్తన
పరీక్షలు చేయించుకోండి.
వాళ్ళ హెచ్ఐవి పరిస్థితి తెలిసినవాళ్ళు హెచ్ఐవి చికిత్స పొందుతున్న వాళ్లు
NA

79% 71%

NA
వీళ్లల్లో వీళ్లల్లో

56% మంది
హెచ్‌ఐవితో
నివసిస్తున్నారు

 సురక్షితమైన సెక్స్ గురించి చదవండి మరియు మీ భాగస్వామికి కూడా అవగాహన
కల్పించండి .

2024 నాటికి మన దేశం ఎయిడ్స్‌ నుంచి పూర్తిగా విముక్తి చెందాలనే
లక్ష్యాన్ని సాధిస్తుందని మేము ఆశిస్తున్నాము మరియు మా వంతు ప్రయత్నంగా
హ్యాపీఏజింగ్ యొక్క పాఠకులకు అవగాహన కల్పించడంతో మా ఉడుత సాయం మేము
చేస్తున్నాము.
సురక్షితమైన శృంగారం గురించి మీ అభిప్రాయాలు మరియు ఎయిడ్స్ నిర్మూలనపై
భారతదేశం యొక్క లక్ష్యం గురించి కమెంట్స్ లో (వ్యాఖ్యలలో) మాకు
తెలియజేయండి. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మా వ్యాఖ్యల విభాగంలో పోస్ట్
చేయడానికి సంకోచించకండి.

Ask a question regarding 2024 నాటికి భారతదేశం ఎయిడ్స్‌ రహితంగా ఉంటుందా?

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here