4 MIN READ

“వృద్ధాప్యం‘ అంటే యవ్వనాన్ని కోల్పోవడం కాదు, ఇది కొత్త అవకాశం మరియు
బలం యొక్క కొత్త దశ.”
-బెట్టీ ఫ్రీడాన్

కిరణ్‌పాల్ సింగ్ ధోడి అదే నిర్వచించారు. అతనొక 62 ఏళ్ల జాతీయ
స్థాయి అథ్లెట్. అతని పేరు క్రింద అనేక సగం మరియు పూర్తి
మారథాన్‌లు ఉన్నాయి. అధికారిక శిక్షణ లేకుండా కేవలం ఉత్సాహం,
క్రమశిక్షణ మరియు అతని బూట్లు సహాయం తో దోధి ఇవ్వన్నీ
సాధించారు. అతను ఇప్పుడు ఒక ప్రసిద్ధ రన్నర్..

గత కొన్ని సంవత్సరాలుగా రన్నర్ గా రాణిస్తున్న కిరణ్ పాల్, తన
కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నాడు. అతను చిన్న వయస్సు నుండే
ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తి మరియు కొన్నేళ్లుగా యోగా మరియు
జాగింగ్ చేస్తున్నాడు. అతని దృష్టి అంతా అతను ఫిట్ గా మరియు
ఆరోగ్యంగా ఉండటం పైనే.

హ్యాపీఅజింగ్ మిస్టర్ ధోడితో మాట్లాడాలని మరియు అతని
ప్రయాణాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే మేము
వత్తాసు పలికే ప్రతిదాన్ని అతను వ్యక్తీకరిస్తాడు: మీ అభిరుచుల
మేరకు మీ వృద్ధాప్యాన్ని జీవించటం.
ఇది ఎలా ప్రారంభమైంది

నేను ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మక్కువ చూపించే
ఫిట్నెస్ ఔత్సాహికుడిగా ఉన్నాను. నేను మారథాన్ రన్నింగ్‌ను ఇష్టపడ్డాను.
కాబట్టి 2004 లో స్టాండర్డ్ చార్టర్డ్ ముంబై మారథాన్ (ఎస్ సిఎమ్ ఎమ్)
యొక్క మొదటి ఎడిషన్ ప్రకటించినప్పుడు, 42 కి.మీ పరుగులో పాల్గొనడం నాకు
సంతోషంగా ఉంది. నేను ఆ పరుగును 5 గంటలు 5 నిమిషాల్లో పూర్తి చేశాను.
అప్పటినుంచి నుంచి నేను 2010 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను.

కానీ, 2010 సంవత్సరంలో, నేను నా వ్యాపార పర్యటనలో ఉన్నప్పుడు, భారీ
సామాను ఎత్తడం వల్ల నా కుడి చేయి, మెడ మరియు భుజంపై తీవ్రమైన సర్వైకల్
స్పాండిలైటిస్‌తో బాధపడ్డాను, దీని ఫలితంగా 15 రోజుల ట్రాక్షన్లతో
ఆసుపత్రిలో చేరాను. నన్ను బెడ్ రెస్ట్ మీద ఉంచారు, లేకపోతే పక్షవాతం దాడికి
గురయ్యే ప్రమాదం ఉంది. ఆ తరువాత మూడేళ్లపాటు నేను పరుగును
విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ గాయం కారణంగా నేను ఇప్పటికీ ఆరోగ్య
సమస్యలతో బాధపడుతున్నాను.

ఇది పరుగు పట్ల నాకున్న ప్రేమ మరియు అభిరుచి వల్ల, నేను 2014 లో నా శిక్షణను
తిరిగి ప్రారంభించాను మరియు 2015 నుండి ముంబై హాఫ్ మారథాన్‌లో పాల్గొనడం
ప్రారంభించాను.

  

దినచర్య

రన్నింగ్ మరియు ఫిట్‌నెస్ కోసం నా ఉత్సాహం నన్ను ఇంకా దీనిని కొనసాగించేలా
చేస్తుంది. నేను ఒక కఠినమైన ఆరోగ్య దినచర్యను అనుసరిస్తాను.

4:30 AM: మేలుకోవటం
5:30 AM: ఇంటి నుండి బయలుదేరటం
6:00 AM: ముంబైలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కండివాలి (ఇ) లో నా రోజువారీ శిక్షణను ప్రారంభించటం
ఉదయం 8:00 వరకు: వివిధ రన్నింగ్ వర్కౌట్లు మరియు ప్రతి రోజు భిన్నంగా రూపొందించబడే స్ట్రెచ్ వ్యాయామాలు
9-5 PM: నా ఉద్యోగ సమయం
8:00 PM: ఇంటికి తిరిగి రావటం

నాకు తక్కువ ఆహారం కావాలి కానీ, విశ్రాంతి తీసుకోవడానికి మరియు కోలుకోవడానికి
చాలా నిద్ర అవసరం. నేను ఆరోగ్యకరమైన జీవనానికి ప్రాముఖ్యత ఇస్తాను మరియు
సరైన ఆహారం తీసుకుంటూ మంచి వ్యాయామం చేసే దినచర్యను అనుసరించడాన్ని
గట్టిగా నమ్ముతున్నాను.

నేను సరళమైన జీవనాన్ని నమ్ముతున్నాను. నేను సమయం దొరికినప్పుడల్లా
గుర్బానీ కీర్తనలు మరియు కథలను వింటూ ధ్యానం చేస్తాను. అది నా ఆత్మ యొక్క
ఆహారం.

విజయాలు

నాకు అత్యంత గుర్తుండిపోయే సంఘటనలలో ఒకటి ఎస్ సిఎమ్ ఎమ్ 2013
సందర్భంగా నాకు శ్రీ ఫౌజా సింగ్ జీతో కలిసి పోటీ చేసే అవకాశం వచ్చింన
సందర్భం. 2017 లో, బికెసి బాంద్రాలో జరిగిన సీనియర్ సిటిజన్స్ రన్
గెలిచినప్పుడు నాకు శ్రీ మిల్కా సింగ్ జీ నుండి ప్రథమ బహుమతి లభించింది. ఈ
ఇద్దరు లెజెండరీ రన్నర్లు నాకు పెద్ద ప్రేరణ.

 

ఫౌజా సింగ్ గారితో

ముంబై రోడ్ రన్నర్స్ (ఎంఆర్ఆర్) నాకు 59 సంవత్సరాల వయసులో ‘2015
సంవత్సరపు ఉత్తమ తొలి రన్నర్’ అవార్డు ఇచ్చినప్పుడు; ‘డెబ్యూటెంట్’
ఎందుకంటే నేను 2015 లో పోటీ పరుగులు ప్రారంభించాను.

గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్
ఛాంపియన్‌షిప్‌లో నాకు 10000 మీటర్ల పరుగులో రజత పతకం, 5000 మీటర్ల
పరుగులో కాంస్య పతకం లభించాయి మరియు ఈ సంవత్సరం కూడా బెంగుళూరులోని
మాస్టర్స్ అథ్లెటిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించాను. దాన్ని నేను
చాలా గొప్పగా భావిస్తాను. ఎందుకంటే, అప్పుడు నేను భారతదేశం నలుమూలలో నా
వయస్సులోని ఉత్తమ రన్నర్లతో పోటీ పడాల్సి వచ్చింది.

గత సంవత్సరం నేను చైనాలోని రుగావోలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్
ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాను మరియు 5000 మీటర్ల
పరుగు మరియు 10000 మీటర్ల పరుగులో పాల్గొన్నాను. అందులో నేను 14 వ

స్థానంలో నిలిచాను. ఎందుకంటే చైనీస్ మరియు జపనీస్ మనకంటే చాలా బలంగా
ఉన్నారని నేను గుర్తించాను.

Wiమిల్కా సింగ్ గారితో

59 సంవత్సరాల వయస్సులో ప్రారంభించడం అనేది చాలా
ఆలస్యమేం కాదు

59 ఏళ్ళ వయసులో నేను పోటీ పరుగు చేయడం ఎలాగ అని ప్రజలు నన్ను అడిగినప్పుడు,
నాకు ఆదర్శమైన శ్రీ ఫౌజా సింగ్ గారు, పురాతన మారథాన్ రన్నర్ అయినప్పుడు, తన
పరుగెత్తే వృత్తిని 89 సంవత్సరాల వయస్సులో ప్రారంభించినప్పుడు , అప్పుడు
నేను చాలా తక్కువ వయస్సులోనే చేసినట్లే కదా అని నేను వారికి చెప్తున్నాను.

ఆహరం

ప్రస్తుతం నా ఆహరంలో ఎక్కువగా పండ్లు, భక్రీ రోటీ మరియు కూరగాయలు లేదా
భోజనంలో పప్పు, సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన మూంగ్ మరియు చనా,
ముడి బీట్‌రూట్ మరియు ముడి మొక్కజొన్న ఉంటాయి. రాత్రి భోజనం లో నేను
రెండు గ్లాసుల క్యారెట్ మరియు బీట్‌రూట్ జ్యూస్, కొన్ని పొడి పండ్లు
మరియు కాయలు, విత్తనాలు మరియు కొన్ని తేలికపాటి వండిన కూరగాయలను
తీసుకుంటాను.

లక్ష్యాలు

నా వయస్సు విభాగంలో, భారతదేశం ఉత్పత్తి చేసిన ఉత్తమ రన్నర్ ను కావాలని
మరియు ఎటువంటి వ్యాధి రాకుండా నా జీవితాన్ని కొనసాగించాలని నా కోరిక.

నేను ఇప్పటికీ ప్రతి రోజు నా జీవితానికి లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాను..

భారతదేశంలోని యువతకు సందేశం

యువతరానికి నా సందేశం ఏమిటంటే ఆరోగ్యం నిజమైన సంపద, వారు వర్చువల్
ప్రపంచం నుండి బయటకు వచ్చి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సహజ పరిసరాలలో
పరుగెత్తటం ప్రారంభించాలి. భారతదేశాన్ని ఫిట్ గా చూడాలన్నది నా కల.

పక్షవాతం దాడికి గురికావడం మరియు మంచం పట్టడం నుండి, ఇప్పుడు
జాతీయ స్థాయి అథ్లెట్ అవ్వడం వరకు, మిస్టర్ ధోడి కథ మనకు ఎంతో
నేర్పుతుంది. అవరోధాలకి ఆగిపోవద్దనే స్ఫూర్తిని రేకెత్తిస్తుంది.
అతను యువకులకు మరియు పెద్దవారికి ఒక ఆదర్శం. మన వయస్సుతో సంబంధం
లేకుండా మన ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా మనల్ని
ప్రేరేపిస్తాడు. మేము హ్యాపీఏజింగ్ లో చెప్పినట్లుగా, ఆరోగ్య
సర్వదా : ఆరోగ్యం చాలా ముఖ్యం.

Ask a question regarding 62 ఏళ్ల మారథాన్ రన్నర్ కిరణ్‌పాల్ సింగ్ ధోడి కథ

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here