2 MIN READ

82 ఏళ్ల వ్యక్తి, ఇతర వ్యక్తులకు చికిత్స చేయడానికి తన బండి పై 160 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నాడు. చమత్కారంగా అనిపిస్తుంది, కదా? మిస్టర్ పరశురామ్ సాధలే 82 ఏళ్ల యువకుడు, అతను యోగి బోధకుడు మరియు ఆక్యుప్రెషర్ నిపుణుడు. యోగా మరియు ఆక్యుప్రెషర్ సైన్స్ ద్వారా తన ప్రయాణం గురించి తెలుసుకోవడానికి హ్యాపీఏజింగ్ మిస్టర్ సాధాలేను కలిసి ముచ్చటించింది.

జీవితం మీమీద చింతలు విసిరితే వాటితో చింత పచ్చడి పెట్టుకోండి అనే సామెత ఉంది. అప్పటి 50 ఏళ్ల పరుశు రామ్ సాధనకు జీవితం చింతకాయలు ఇవ్వలేదు. మిస్టర్ సాధాలే హిందీ ఉపాధ్యాయుడు. తన పదవీ విరమణ తరువాత, అతను సౌకర్యవంతమైన జీవితం గడుపుతూ స్థిరపడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అతనికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ప్రముఖ దినపత్రికలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, 69.2 మిలియన్ల భారతీయ వయోజనులు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. మరియు ఇది వృద్ధులలో సాధారణం అయిపోయింది. వారిలో చాలామంది, కొన్ని సంవత్సరాలు మందులు వాడాక కూడా అది నయం కాక ఇక ఆశలు వదిలేసుకుంటున్నారు.

కానీ, మిస్టర్ పరశురామ్ సాదాలే అలా కాదు. అతను డయాబెటిస్ ను ముక్కుకు తాడేసి దానిని ఓడించాలని నిర్ణయించుకున్నాడు.

సుఖమైన వృద్ధాప్య జీవితంకోసం కొన్ని విలువైన చిట్కాలను తెలుసుకుందామని హ్యాపీఏజింగ్ ఈ 82 ఏళ్ల యోగిని కలిసింది.ఈ చిట్కాలు పెద్దవాళ్లకు మాత్రమే కాదు, అన్ని వయస్సుల వారికి సంబంధించినవి.

పర్షురామ్ సాధలే డయాబెటిస్‌ను ఎలా ఓడించారు?

టైప్ –2 డయాబెటిస్‌ను పూర్తిగా నియంత్రించలేము లేదా పూర్తిగా నయం చేయలేము అనేది ఒక సాధారణ అపోహ. ముందుగా అస్సలు డయాబెటిస్ అనేది ఒక వ్యాధి కాదు అది ఒక పరిస్థితి. రామ్‌దేవ్ బాబా వంటి యోగా బోధకులు మధుమేహాన్ని నయం చేసే వ్యాయామాలను శిక్షణ ఇస్తున్నారు.

రామ్‌దేవ్ బాబా కేంద్రంలో ఇంటెన్సివ్ కోర్సు తరువాత, మిస్టర్ సాధాలే యోగా బోధకుడయ్యారు. జ్ఞానం పట్ల అతనికున్న జిజ్ఞాస ఆయన్ని  నేచురోపతి మరియు ఆక్యుప్రెషర్ వంటి కొత్త ప్రత్యామ్నాయ చికిత్సలను పరిశోధించడానికి కాలు కదిపేలా చేసింది. అతను ఆక్యుప్రెషర్‌పై దేవేంద్ర వోరా వ్రాసిన పుస్తకాలను విస్తృతంగా చదివాడు మరియు చివరికి స్వతంత్రంగా ఆక్యుప్రెషర్‌ను అభ్యసించేంతగా సన్నద్ధమయ్యాడు.

యోగా మరియు ఆక్యుప్రెషర్ యొక్క శక్తి

శరీరం అనేది మీ ఆలయం లాంటిది. మీరు దానిని జాగ్రత్తగా చూసుకుంటే, అది మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటుంది!”

మిస్టర్ సాధాలే మనుషుల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు. ఈ సేవ చేయగలిగినందుకు తనను తాను చాలా అదృష్టవంతుడిగా భావిస్తారు. వాస్తవానికి, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కాలేయ వ్యాధులు, నిద్రలేమి, డయాబెటిస్, గుండె రుగ్మతలు, ఉబ్బసం, స్ట్రోక్ మరియు గ్యాంగ్రేన్ వంటి వ్యాధులతో పాటు రక్త క్యాన్సర్ మరియు టిబి వంటి కొన్ని ప్రాణాంతక వ్యాధులను ఆయన నయం చేసారు.

ఉదాహరణకి, మిస్టర్ సాధాలే భార్య గుండెపోటుతో బాధపడుతున్నప్పుడు, ప్రకృతివైద్యం మరియు ఆక్యుప్రెషర్ ద్వారా ఆమెకు నయం చేయాలని నిష్ఠ పూనాడు. ఇప్పుడు ఆమెకు పూర్తిగా నయమై ఆరోగ్యంగా ఉంది.

మిస్టర్ సాధలే చేత వారి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్న ప్రజలు అతన్ని దేవుని దూత అని కొనియాడుతారు. అయితే, మిస్టర్ సాధలే దీనిని నిరాడంబరంగా ఖండించారు. శరీరం అనేది మీ ఆలయం లాంటిది. దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే, అది మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటుందని ఆయన చెప్పారు.

సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం

సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం ఎప్పుడూ రెండు సాధారణ నియమాలను పాటించాలి అని పరశురామ్ సాధలే చెప్పారు. అవి:

  1. రోజూ సరైన ప్రేగు కదలిక ఉండాలి
  2. భోజనం చేయబోయే గంట ముందు మరియు చేసిన గంట తరువాత వరకు నీరు తాగవద్దు

అతని ప్రకారం, ఈ రెండు సరళమైన నియమాలే సంతోషకరమైన జీవితానికి రహస్యం.

మిస్టర్ సాధలే వివిధ యోగా ఆసనాలను సునాయాసంగా చేయడం మేము చూసి, అతని చురుకుదనం మరియు బలానికి మా హ్యాపీఏజింగ్ బృందం ఆశ్చర్యపోయాం. అతను యోగాభ్యాసం చేయడం మొదలుపెట్టినప్పటి నుండి, అతను 25 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు భావిస్తున్నాడని ఈ అష్టాశుకుడు గర్వంగా చెప్పాడు. మేము అతని స్ఫూర్తిని అభినందిస్తున్నాము మరియు యోగా మరియు ఆక్యుప్రెషర్ యొక్క పురాతన శాస్త్రంపై అవగాహన కల్పించాలన్న అతని గొప్ప మిషన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము.

 ఈ యోగా శిక్షకుడు ఏమి చెప్పాడో తెలుసుకోడానికి వీడియో చూడండి!

Ask a question regarding 82 సంవత్సరాల వయస్సులో ఫిట్ గా ఉన్న పరుశురామ్ సాధాలే యోగా మరియు ఆక్యుప్రెషర్‌తో తన జీవితాన్నే మార్చుకున్నారు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here