1 MIN READ

ప్రపంచ వృద్ధుల జనాభా పెరుగుదల రిపోర్టుల ప్రకారం భారతదేశంలోని జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు రు 7.7 శాతంగా నమోదైంది. 2050 ki ఇది 19 శాతానికి పెరిగే అవకాశం ఉంది. వృద్ధాప్య పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నందున వారి సంరక్షణకు ఆరోగ్య అవసరాలకు తగిన మార్గదర్శకాలను రూపొందించుకొని అందరి జీవనయానాన్ని సుఖవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

సైన్సు సాంకేతిక పరమైన అభివృద్ధి తోటి, వైద్యపరమైన పురోభివృద్ధి తోటి అధునాతనమైన వైద్య పరికరాల రూపకల్పనకు కృషి చేయాలి. బాల్యంలో చిన్న పిల్లలకు అవసరమైన జాగ్రత్తలు సూచనలు ఎలా మనం పాటిస్తాము కూడా అదేవిధమైన సంరక్షణ తీసుకోవటానికి తగిన చర్యలను విధివిధానాలు రూపొందించి అవలంబించాలి.

వ్యాక్సిన్లు చాలా ముఖ్యమైనవి. వృద్ధాప్య ఛాయలు పూర్తిగా అలుముకునేలోపే రోగ నిరోధకశక్తిని పటిష్టం చేసి, నయంచేసే టీకాలను అవగాహన కల్పించి సత్వర ఫలితంగా అందించాలి.

భారతదేశంలో అతి ముఖ్యమైన 5 టీకాలు:

1.   ఇన్ఫ్లుఎంజా(Influenza) వ్యాక్సిన్:

ఈ వ్యాక్సిన్‌ ఇన్ఫ్లుఎంజాకి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తుంది. ఏటా 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు అధిక మోతాదు ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ సిఫార్సు చేయబడింది.

2.   న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్(Pneumococcal infection):

న్యుమోకాకస్ బ్యాక్టీరియా వల్ల కలిగే న్యుమోనియాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ప్రతిరోధకాలను అభివృద్ధి చేస్తుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ టీకా సిఫార్సు చేయబడింది.

3.   హెర్పెస్ జోస్టర్ (షింగిల్స్) టీకా:

ఇది షింగిల్స్ అనే బాధాకరమైన పరిస్థితి నుండి రక్షిస్తుంది, ఇది బాధాకరమైన పొక్కులు వచ్చే దద్దుర్లు కలిగించే వ్యాధి. వృద్ధులకు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల నిద్రాణమైన వైరస్ తిరిగి పనిచేయడం  పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వృద్ధులలో ఎక్కువ మంది 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సుగలవారు. కాబట్టి ఇది 60సంవత్సరాల వయస్సులో ఒకసారి సిఫార్సు చేయబడింది.

4.   టిడాప్(Tdap vaccines) టీకాలు:

65 ఏళ్లు పైబడిన వృద్ధులకు టిడాప్(Tdap vaccines)వ్యాక్సిన్ ఇవ్వాలి, వారు దగ్గు సంబంధిత సమస్యల నుండి  రక్షించుకోవటానికి,  సిడిసి సిఫారసుల ప్రకారం, వృద్ధులందరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ మోతాదును తీసుకోవాలి.

5.   హెపటైటిస్ బి:

భారతదేశంలో హెపటైటిస్ బి యొక్క ప్రాబల్యం 2 నుండి 10% వరకు ఉంటుంది. హెపటైటిస్-బి కాలేయానికి సోకే ఒక అంటు వైరస్. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు హెపటైటిస్ బి టీకాలకు యాంటీబాడీ ప్రతిస్పందన తగ్గుతుంది. ఈ టీకాను ప్రజా భద్రతా కార్యకర్తలుగా ఉన్న వృద్ధులకు మరియు కార్యాలయంలో రక్తానికి గురైన వారికి సిఫార్సు చేయబడింది.

ఇవి కాకుండా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్-ఎ టీకాలు కూడా సిఫార్సు చేస్తారు.

  • 11
    Shares

Ask a question regarding వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి పెంపొందించుకోవడానికి పంచసూత్రాలు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here