2 MIN READ

ఇంటి సంరక్షణ అంటే ఏమిటి?

క్యాన్సర్ దీర్ఘకాలిక రికవరీ ప్రక్రియ కలిగిన ఒక వ్యాధి. మందులు, కీమోథెరపీ, రేడియేషన్ మరియు చికిత్సల యొక్క ఇతర అంశాలు రోగిని ఒత్తిడికి గురిచేస్తాయి మరియు వారిలో చాలామంది వారి ఇళ్లలో  సౌకర్యంగా కోలుకోవడానికి ఇష్టపడతారు. ప్రజలు ఇంట్లో, సురక్షితమైన మరియు సుపరిచితమైన పరిసరాలలో ఉండటాన్ని సౌకర్యంగా భావిస్తారు. వారు కుటుంబం మరియు స్నేహితుల చుట్టూ ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే అది ఆసుపత్రి పరిసరాలతో పోలిస్తే సంతోషకరమైన వాతావరణంగా అనిపిస్తుంది.

ఒక రోగి ఇంట్లో కోలుకోవడానికి ఎంచుకున్నప్పుడు, వారి కోసం శ్రద్ధ వహించే బృందంలో కేస్ మేనేజర్లు, నర్సులు, ఫిజికల్ థెరపిస్ట్‌లు, వైద్యులు మరియు రోగి యొక్క కుటుంబం ఉంటాయి. గృహ సంరక్షణ సిబ్బంది ఆన్-సైట్ వైద్య పరికరాలను ఉపయోగించుకుంటారు, శారీరక చికిత్సకులు వంటి ఇతర వైద్య సిబ్బంది సందర్శనల సమయంలో సహాయం చేస్తారు, రోగి భోజనం సిద్ధం చేస్తారు, వ్యక్తిగత పరిశుభ్రతను పర్యవేక్షిస్తారు మరియు సూచించిన మందులను ఇస్తుంటారు.

గృహ సంరక్షణ సేవలు రెండు రకాలు ఉంటాయి:

  • అత్యవసర ఇంటి సంరక్షణ: రోగి వారి పునరుద్ధరణను స్వతంత్రంగా నిర్వహించగలిగే వరకు రోగికి మరియు కుటుంబానికి అవసరమైన సంరక్షణ నేర్పుతారు.ఇది వారి అనారోగ్యం యొక్క ప్రారంభ దశలలో ప్రజలు ఎంచుకునే ఒక రకమైన సేవ. లక్షణాలు తీవ్రంగా ఉండకపోయినా, వాటిని నిర్వహించడానికి సహాయం అవసరం.
  • దీర్ఘకాలిక గృహ ఆరోగ్య సంస్థ: ఈ రకమైన ఏజెన్సీ రోగిని ఒక వారానికి ఇన్ని నిర్ణీత గంటలు అని పర్యవేక్షిస్తుంది. క్యాన్సర్ చికిత్సలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల యొక్క మార్పులు లేదా దుష్ప్రభావాల విషయాల్లో కూడా ఇవి సహాయపడతాయి.

ఇంటి సంరక్షణ యొక్క ప్రయోజనాలు

క్యాన్సర్ చికిత్స శరీరాన్ని హరించడమే కాదు; ఇది ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ రోగులలో ఒంటరితనం, ఒత్తిడి మరియు ఆందోళన చాలా సాధారణం. ఇంటి సంరక్షణ రోగికి తన ఇంటి సౌకర్యాన్ని ఇవ్వటమే కాకుండా, సుపరిచితమైన పరిసరాలు ఉన్నందున ఇది రోగి యొక్క ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఆసుపత్రిలోని నర్సుల సంరక్షణకు బదులుగా స్నేహపూర్వక ముఖం ఎదురుగా ఉండటం ఎల్లప్పుడూ సహాయపడుతుంది. వ్యక్తిగత అటెండెంట్‌ను కలిగి ఉండటం వలన, రోగి ఆసుపత్రి మంచంలో ఉన్న మరొక జబ్బుపడిన వ్యక్తి లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన సంరక్షణ ప్రణాళిక కలిగిన వ్యక్తిలా భావిస్తాడు. ఒక సంరక్షకునితో ఇంట్లో నివసించే క్యాన్సర్ రోగికి గొప్ప సౌకర్యం, నియంత్రణ మరియు భద్రత ప్రధాన ధైర్యాన్ని పెంచుతాయి.

సంరక్షణ అనేది రోగికి అనేక ఆసుపత్రి సందర్శనలు మరియు చికిత్సలో కోల్పోయిన అనుభూతికి బదులుగా ఉద్దేశ్య భావనను కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. అనారోగ్య రోగులను పెంపుడు జంతువు లేదా మొక్కల సంరక్షణకు కూడా సంరక్షకులు సహాయపడతారు.  ఇది జీవిత చివరలో ఒక  ప్రోత్సహకం లాగా మరియు ఒక సాఫల్యాన్ని అందిస్తుంది. క్యాన్సర్ రోగులకు వారు విలువైన, గౌరవప్రదమైన మరియు ముఖ్యమైన జీవితాలను గడిపినట్లుగా భావించడం మరియు వారు అందరిలాగా మాములుగా  వ్యక్తే అనే భావన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

ఇంటి సంరక్షణ అనేది శారీరకంగా మరియు మానసికంగా వ్యాధితో పోరాడటాన్ని సులభం చేస్తుంది. మీ వైద్యుడు రోగి యొక్క శ్రేయస్సు కొరకు ఏది ఉత్తమమైనదో మరియు ప్రసిద్ధ గృహ సంరక్షణ సంస్థల జాబితాను అందించగలగాలి.

 

  • 7
    Shares

Ask a question regarding క్యాన్సర్ రికవరీ కోసం ఇంటి సంరక్షణ ఎంపిక గురించి వివరంగా తెలుసుకోండి

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here