వీక్షించండి: 50 ఏళ్ల వయస్సు పైబడిన తరువాత శృంగారం మరియు మొదలైన విషయాల పై “ఫీస్టీ ఎట్ ఫిఫ్టీ” రచయిత సుధా మీనన్ అభిప్రాయాలు

0
2 MIN READ

వయస్సు మీ ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది అనుకుంటే మీరు అనుకున్నది తప్పు అని ఈమె నిరూపిస్తుంది. ఐదు నాన్-ఫిక్షన్ పుస్తకాల యొక్క అందమైన మరియు ప్రసిద్ధ రచయిత, సుధా మీనన్ తన తాజా ప్రచురణ ‘ఫీస్టీ ఎట్ ఫిఫ్టీ’ లో తన అనుభవాలను నిష్కపటంగా వివరించింది.

52 ఏళ్ల ఈ రచయిత, జర్నలిస్ట్ మరియు రైటింగ్ కోచ్ లిప్‌స్టిక్‌ ధరించి, ఆమె ఆకర్షణీయమైన చిరునవ్వుతో మూసపోకడలను తరిమేసి, వయస్సుతో సంబంధం లేకుండా సంపూర్ణ మరియు నిర్భయ జీవితాన్ని ఎలా గడపాలో ప్రపంచానికి తెలియజేస్తుంది.

హ్యాపీఏజింగ్ సుధా మీనన్‌ యొక్క సుందరమైన ఇంట్లో ఆమెను కలుసుకుని వయస్సు, ఆరోగ్యం మరియు ఇంకా మరెన్నో విషయాల గురించి మాట్లాడారు.

మేము అడిగిన ప్రశ్నలకు సుధా మీనన్ గారు చాలా అద్భుతంగా స్పందించారు. ఆమె యొక్క స్ఫూర్తి మరియు ఉత్సాహాన్ని చూసి మేమే విస్తు పోయాం. అవి మీతో పంచుకోబోతున్నాం (వీడియో లోని టైమ్‌స్టాంప్‌లతో):

1:11 ఫిస్టీ ఎట్ ఫిఫ్టీలో మీ అనుభవాలను వివరించడానికి మిమ్మల్ని ప్రేరేపించినది ఏమిటి?

“ఇన్ని సంవత్సరాలుగా నాకు ఎదురైన నా స్వీయ జీవిత అనుభవాలే నాకు ప్రేరేపణ కలిగించాయి.” అని సుధా మీనన్ గారు అన్నారు.

2:24 మహిళలపై, ముఖ్యంగా భారతదేశంలో వయస్సుఅనేది ముఖ్య పాత్ర పోషిస్తుండటం మీరు గమనించారా?

“భారతదేశం ప్రపంచంలో అత్యంత పురాతన సమాజాలలో ఒకటి మరియు ఇది ఖచ్చితంగా మహిళలపై ప్రభావం చూపుతుందని మరియు  బోలెడంత మంది సన్నిహితులు ఏ వయస్సు కు ఏది సముచితం మరియు ఏది కాదు అని బోలెడు సలహాలు ఇస్తూ ఉంటారు.” అని రచయిత అన్నారు.

3:37 యాభై సంవత్సరాల వయస్సు పైబడిన తరువాత జనాలు వారి ఆరోగ్యం మరియు అందాన్ని పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారా?

“మహిళలను వారి ఆరోగ్యం మరియు అందాన్ని వదులుకోవడానికి బలవంతం చేసే పరిస్థితులని కొన్ని సంవత్సరాలుగా సృష్టించడం వల్ల  మహిళలు అలా వాటిగురించి పట్టించుకోవడం మానేస్తున్నారు.” అని సుధా మీనన్ గారు నొక్కి చెప్పారు. కానీ, ఆమె మాత్రం అలా వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేదని తెలిపారు.

4:47 మీరు ఫిట్ గా ఉండటానికి ఏం చేస్తారు?

ఈ అందమైన రచయిత ఆమె చాలా ఫిట్ గా ఉందని అంటే నమ్మట్లేదు (మేము ఆమెతో ఏకీభవించము), కానీ ఆమె నడక ద్వారా ఆమె తన ఫిట్నెస్ ను కాపాడుకుంటుందని చెప్పారు.

5:45 ‘యాభై తర్వాత సెక్స్ మందకొడిగా ఉంది’ – ఇది నిజమా?

“మందకొడిగా కాదు నెమ్మదిగా జరుగుతుంది. ఎందుకంటే నిదానమే ప్రధానం.” అని సుధా చమత్కరించారు.

7:01 యాభై ఏళ్ల వయస్సు పైబడిన జంటల మధ్య సంబంధాలు ఎలా అనిపిస్తాయి?

“50 ఏళ్ళ వయస్సు పైబడిన తరువాత సంబంధాలు హార్మోన్ల ద్వారా నడిపించబడవు. అనుకూలత్వం మరియు ఇతరత్రా మీద ఆధారపడి ఉంటాయి.” అని రచయిత చెప్పారు.

7:41 యాభై ఏళ్ల వయస్సు కూడా 30 ఏళ్ల వయస్సు లాగానే ఉంటుందా?

“నేను మళ్ళీ 30 ఏళ్ళ వయసులోకి మాత్రం వెళ్లాలనుకోవటం లేదు. ” అని రచయిత చిన్న నవ్వు నవ్వింది.  50 ఏళ్ళ వయసప్పుడు అంత ముఖ్యమైనదిగా అనిపించని బోలెడన్ని విషయాల వెనుక 30వ దశకం లో ప్రజలు ఎలా వాటి వెంట పరిగెడతారో రచయిత వివరిస్తుంది. ప్రస్తుత జీవిత దశను ఆమె ఆనందిస్తున్నానని రచయిత తెలిపింది.

8:12 మీ తల్లితో మీ సంబంధం గురించి మాకు తెలియజేయండి – ఆమె మీకు పాలు తాపించే దగ్గరినుండి మీరు ఆమెకు సిరప్ తాగించేవరకు అంతా చెప్పండి.

అది తన జీవితంలోనే ఒక వరం లా దొరికిన అద్భుతమైన సంబంధమని మరియు అది తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన సంబంధమని రచయిత తెలిపారు. అంతేకాకుండా ఆమె తన తల్లిని మరియు సంబంధాల గతిశీలతను ఇప్పుడింకా బాగా ఎలా అర్ధం చేసుకుంటుందో చెప్పారు.

 

9:10 మీరు దూరంగా ఉండి కూడా ఆమెను బాగోగులు ఎలా చూసుకుంటున్నారు?

సుధా గారు సుదూర సంరక్షణ గురించి మాట్లాడుతారు మరియు తను మరియు ఆమె సోదరి వాళ్ల అమ్మని ఎలా చూసుకుంటారో మరియు వాళ్ళ అమ్మకి ఎప్పుడూ అదే ప్రేమ, సంరక్షణ ఉండేలా చూసుకుంటారో తెలియజేస్తుంది.

మీ అమ్మగారు బిజీ గా ఉండటం ద్వారా ఎలా నిరాశ నిస్పృహలోంచి బయటపడ్డారో తెలియజేయండి?

తన తండ్రి మరణించిన తరువాత తన తల్లి తన హృదయంలో బాధను ఎలా అనుభవించిందో మరియు ఒక రోజు తన కుమార్తె ఇంటికి వెళ్ళిన తరువాత  ఎలా అంతా మారిపోయి అందంగా మారిపోయిందో, సుధ మనతో పంచుకుంటుంది. ఆమె రచనలో నిమగ్నమై తనను తాను బిజీగా ఎలా ఉంచుకుంటుందో ఆమె చెబుతుంది. ఆమె తన భర్తతో ఉన్న సంబంధం గురించి ఒక పుస్తకం రాయడం కూడా చేసింది, ఇది ఆమెకు నిరాశతో వ్యవహరించడానికి సహాయపడింది.

12:18 భారతదేశంలోని వృద్ధుల సంరక్షణ పరిస్థితి గురించి మీ స్పందన ఏమిటి?

వృద్దుల సమస్యలను పరిష్కరించేటప్పుడు అవసరమైన తాదాత్మ్యంతో వారు వ్యవహరించబడట్లేదని మరియు వారి ఆరోగ్య పరిస్థితులు వయస్సుతో గందరగోళం చెందుతున్నాయని రచయిత భావిస్తున్నట్లుగా పేర్కొంది. వృద్ధుల సంరక్షణ ఇప్పటికీ దేశంలో సరిపోను విధంగా లేదని ఆమె అభిప్రాయబడ్డారు.

14:05 మీకు హ్యాపీ ఏజింగ్అంటే ఏమిటి?

జీవితంలో మీకున్న అన్ని విభేదాలను మీరు పరిష్కరించుకుని, మీరు సంతోషకరమైన స్థితిలో ప్రశాంతంగా ఉన్న సమయమే ‘హ్యాపీ ఏజింగ్’ అని ఈ అందమైన రచయిత అభిప్రాయబడ్డారు.

 

ఆమె చమత్కారాలు మరియు ఛలోక్తులతో నిండియున్న పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియోని చూడండి.

  • 61
    Shares

Ask a question regarding వీక్షించండి: 50 ఏళ్ల వయస్సు పైబడిన తరువాత శృంగారం మరియు మొదలైన విషయాల పై “ఫీస్టీ ఎట్ ఫిఫ్టీ” రచయిత సుధా మీనన్ అభిప్రాయాలు

An account for you will be created and a confirmation link will be sent to you with the password.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here